Begin typing your search above and press return to search.
రాముడిగా ప్రభాస్ ఎందుకంటే..!
By: Tupaki Desk | 19 Jun 2023 12:43 PMఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా రీసెంట్ గా రిలీజై టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడుతుంది. టీ సీరీస్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటించారు. ఈ సినిమాలో ప్రభాస్ ని రాముడిగా ఒప్పించడానికి దర్శకుడు ఓం రౌత్ చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. రీసెంట్ ఇంటర్వ్యూలో ఓం రౌత్ ఆ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ నే రాముడిగా ఎందుకు తీసుకున్నారు.. ప్రభాస్ ని ఒప్పించడానికి ఎంత కష్టపడ్డారు అన్నది చెప్పారు.
ఓం రౌత్ ఆదిపురుష్ కథ అనుకున్నప్పుడే రాముడిగా ప్రభాస్ ని ఫిక్స్ అయ్యారట. కానీ ప్రభాస్ ని అనుకున్నంత ఈజీగా ఈ సినిమాకు ఒప్పించలేదని అన్నారు. ఆ పాత్ర కోసం ప్రభాస్ ని ఒప్పించడానికి చాలా కష్టపడ్డానని అన్నారు.
ఆదిపురుష్ సినిమా ఈ తరం కోసం తీసిన సినిమా.. అందుకే మొత్తం రామాయణాన్ని చూపించడం సాధ్యం కాదు. అందుకే ఆదిపురుష్ సినిమాలో యుద్ధ కాండ మాత్రమే చూపించాను.. తనకు కూడా వ్యక్తిగతంగా ఆ భాగమే ఇష్టమని అన్నారు ఓం రౌత్. అందులోనే రాముడు పరాక్రమవంతుడిగా కనిపిస్తాడు.. అయితే ఈ పాత్ర కచ్చితంగా ప్రభాస్ కి సరిపోతుందని అప్పుడే అనుకున్నారట.
హృదయంలో భావాలు కళ్లలో కనిపిస్తాయని ఒక అభిప్రాయం ఉంది. ప్రభాస్ కళ్లలో నీతి నిజాయితీ కనిపిస్తాయి. అంత పెద్ద స్టార్ అయినా కూడా ఎంతో వినయంగా ఉంటాడు. అందుకే ఈ సినిమా అనుకున్న రోజే ప్రభాస్ ని రాముడిగా ఫిక్స్ అయ్యానని అన్నారు ఓం రౌత్.
ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ ని రాముడిగా ఎంపిక చేయాలని అనుకున్నప్పుడు ప్రభాస్ కు ఈ విషయం చెప్పగా అతను ఆశ్చర్యపోయాడని.. అతడిని ఒప్పించడం అంత తేలికగా జరగలేదని అన్నారు ఓం రౌత్. ఫోన్లో పాత్రకు సంబంధించిన వివరాలు చెప్పేందుకు కష్టపడినట్టు చెప్పారు.
ఆ తర్వాత కలిసి స్టోరీ చెప్పగానే అప్పుడు ప్రభాస్ ఓకే అన్నారని చెప్పారు. రాముడి పాత్రలో ప్రభాస్ చాలా శ్రద్ధగా చేశారు. సినిమా పూర్తయ్యేందుకు అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉన్నారు ప్రభాస్. ఈ సినిమాతోనే కాదు ఫ్యూచర్ లో కూడా మా ఫ్రెండ్ షిప్ ఇలానే కొనసాగుతుందని అన్నారు ఓం రౌత్. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ సలార్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద రెబల్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు.