Begin typing your search above and press return to search.

OMG డాడీ: క్యాచీ గా ఉన్న ర్యాప్ సాంగ్

By:  Tupaki Desk   |   22 Nov 2019 2:16 PM GMT
OMG డాడీ: క్యాచీ గా ఉన్న ర్యాప్ సాంగ్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా 'అల వైకుంఠపురములో'. సంక్రాంతి కి విడుదల కానున్న ఈ సినిమా కు ప్రచార కార్యక్రమాలు చాలా రోజుల ముందే ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి 'సామజవరగమన'.. 'రాములో రాముల' సాంగ్స్ రిలీజ్ కావడం సూపర్ హిట్స్ గా మారడం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి 'OMG డాడీ' అనే పాట విడుదలైంది.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు థమన్. OMG డాడీ పాటను ర్యాప్ స్టైల్ లో రూపొందించారు. మామూలు పాటలకు భిన్నంగా ఈ ర్యాప్ స్టైల్ లో సింగర్ మాట్లాడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మధ్య లో బీట్ మారుతూ ఉంటుంది. ఈ పాట లో మరో ఆసక్తికరం అంశం.. తెలుగు ర్యాప్.. ఇంగ్లీష్ ర్యాప్ ను విడివిడిగా ఇద్దరు గాయకులు పాడడం. తెలుగులో రోల్ రిడా.. ఇంగ్లిష్ లిరిక్స్ ను రాహుల్ నంబియార్ పాడారు. ఈ ఇద్దరితో పాటుగా లేడీ కష్ ఫిమేల్ ర్యాప్ ను పాడారు. ఈ పాటకు సాహిత్యం అందించినవారు కృష్ణ చైతన్య. ఈ పాటకు సాహిత్యం అందించడం నిజానికి ఒక డిఫరెంట్ ప్రయత్నం అని చెప్పాలి. ఎందుకంటే ఈ పాటకు మాటల తరహా లో ర్యాప్ సాహిత్యం అందించాలి. దాంతో పాటుగా ట్యూన్ కు సరిపోయే రెగ్యులర్ సాహిత్యం కూడా అందించాలి. కృష్ణ చైతన్య ఈ రెండిటిని చక్కగా బ్యాలెన్స్ చేశారు. "నా స్టొరీ చెప్పలేను నా బాధకంతు లేదు.. ఈ డాడీలందరెందుకిట్ల పీక్కు తింటున్నారు మాట వినిపించుకోరు అస్సలర్థం చేసుకోరు" అంటూ ఒక ఉద్యోగం లేని కుర్ర వాడి డబ్బు కష్టాలను సరదాగా వివరించారు. ఇక ఈ ర్యాప్ పార్ట్ పూర్తి కాగానే "ఓ మై గాడ్ డాడీ జస్ట్ డోంట్ బీ మై బ్యాడీ" అంటూ ఇంగ్లీష్ పదాలతో పాట హూక్ లైన్ వచ్చింది.

ఇక ఈ పాట లో అల్లు అర్జున్ డ్రెస్సులు.. ట్రేడ్ మార్క్ స్టెప్పులు సూపర్ గా ఉన్నాయి. 'స్పై డాడీ' అనే సమయంలో గూఢచారి తరహాలో చేతులు పెట్టి వేసే స్టెప్ అయితే అదిరిపోయింది. ఇక వీడియోలో బన్నీ పిల్లలతో బన్నీని.. బన్నీ - అరవింద్ గారు.. పూజా హెగ్డేతో తన ఫాదర్ ను.. త్రివిక్రమ్ - త్రివిక్రమ్ తండ్రి గారిని.. ఇలా అందరి డాడీల ను చూపించడంతో వీడియో ఇంట్రెస్టింగ్ గా సాగింది. పాట ట్యూన్ డిఫరెంట్ గా ఉంది.. యూత్ కు వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది. క్యాచీ పదాలు కాబట్టి త్వరలోనే యూత్ కు ఫేవరెట్ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆలస్యం ఎందుకు.. OMG డాడీని చూస్తూ మీ డాడీని గుర్తు చేసుకోండి!