Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్‌' లో అతడు పై క్లారిటీ

By:  Tupaki Desk   |   29 May 2021 12:00 PM IST
ఆదిపురుష్‌ లో అతడు పై క్లారిటీ
X
ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓమ్‌ రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదిపురుష్‌ సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ కు చెందిన పలువురు నటీనటులు నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సైఫ్‌ అలీ ఖాన్‌ తో పాటు పలువురు బాలీవుడ్‌ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్‌ సిద్దార్థ్‌ శుక్లా కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది.

సిద్దార్థ్‌ శుక్లా కు దర్శకుడు ఓమ్‌ రౌత్‌ కీలకమైన పాత్రను ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో వచ్చిన పుకార్లకు సిద్దార్థ్‌ శుక్లా క్లారిటీ ఇచ్చాడు. తనను ఆదిపురుష్ సినిమా కోసం ఎవరు సంప్రదించలేదు అంటూ తేల్చి చెప్పాడు. ఆదిపురుష్ లోని ఏ పాత్ర కోసం తనను అడగలేదన్న సిద్దార్థ్‌ శుక్లా ఏదైనా సమాచారం ఉంటే తాను మాత్రమే చెప్తాను అని.. ఇతర వార్తలను నమ్మవద్దంటూ క్లారిటీ ఇచ్చాడు.

భారీ బడ్జెట్‌ తో విజువల్‌ వండర్‌ గా రామాయణ ఇతివృత్తంతో రూపొందుతున్న ఆది పురుష్ సినిమా పై దేశ వ్యాప్తంగానే కాకుండా అన్ని చోట్ల ఉన్న హిందువులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రామాయణం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కాని ఆదిపురుష్‌ చాలా ప్రత్యేకం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ రాముడిగా సైఫ్‌ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా మరో లెవల్‌ లో ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.