Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ 'ఆదిపురుష్‌' మొదలైంది

By:  Tupaki Desk   |   22 Dec 2020 10:50 AM GMT
ప్రభాస్‌ ఆదిపురుష్‌ మొదలైంది
X
ప్రభాస్‌ బాలీవుడ్‌ మూవీ 'ఆదిపురుష్‌' కోసం ఉత్తర దక్షిణాది సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామాయణం ఇతివృత్తంగా రూపొందబోతున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీరణకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రియాల్టీ కంటే వీఎఫ్‌ఎక్స్‌ సీన్స్‌ షాట్స్‌ ఎక్కువగా ఉంటాయట. అందుకే ఇప్పటికే ఆదిపురుష్‌ కు సంబంధించిన విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ను దర్శకుడు మొదలు పెట్టించాడట. ప్రపంచ ప్రసిద్ది గాంచిన రెండు ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలు ఆదిపురుష్‌ కోసం ఇప్పటికే పనులు మొదలు పెట్టాయని అంటున్నారు.

రికార్డు స్థాయి బడ్జెట్‌ ను ఈ సినిమా కోసం ఖర్చు చేస్తుండగా అందులో మెజార్టీ పార్ట్‌ విఎఫ్‌ఎక్స్‌ కే ఖర్చు కాబోతున్నట్లుగా చెబుతున్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్టులను ఈ సినిమాలో పార్ట్‌ చేయడం ద్వారా అద్బుతమైన విజువల్‌ వండర్‌ గా సినిమాను తీర్చి దిద్దాలని దర్శకుడు భావిస్తున్నాడు. ఇక షూటింగ్‌ పార్ట్‌ ఎప్పుడు మొదలు పెడతారనే విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కేవలం మూడు నెలల్లోనే షూటింగ్‌ ను ముగించేయాలని దర్శకుడు భావిస్తున్నాడట. సంవత్సర కాలం పాటు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కు సంబంధించిన వర్క్‌ ను జరుపబోతున్నారని అంటున్నారు. ప్రభాస్‌ రాముడిగా నటించబోతున్న ఈ సినిమాలో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా కనిపించబోతున్నాడు. ఇతర నటీ నటులు ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.