Begin typing your search above and press return to search.

ప్రభాస్ మూవీ కోసం న్యూ టెక్నిక్ తీసుకురాబోతున్నారా...?

By:  Tupaki Desk   |   15 Oct 2020 2:00 PM GMT
ప్రభాస్ మూవీ కోసం న్యూ టెక్నిక్ తీసుకురాబోతున్నారా...?
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ 'ఆదిపురుష్‌' అనే స్ట్రెయిట్ హిందీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ దర్శకత్వం వహించనున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో 'డార్లింగ్‌' ప్రభాస్‌ 'రాముడి'గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ 'లంకేష్'గా కనిపించనున్నారు. టీ సిరీస్ భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. 'బాహుబలి' సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ కి తన సత్తా ఏంటో చూపించిన ప్రభాస్ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్టే 'ఆదిపురుష్‌' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్.. వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఉండనున్నాయట. 'తానాజీ' సినిమాతో తానేంటో చూపించిన ఓం రౌత్‌.. 'ఆదిపురుష్' ని నెక్స్ట్ లెవెల్ లో ఆవిష్కరించనున్నాడట. ఇటీవల ఓం రౌత్‌ ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ.. ''ప్రభాస్ ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న అతి పెద్ద సూపర్ స్టార్. 'ఆదిపురుష్' స్క్రిప్ట్ చెప్పిన వెంటనే సంతోషంగా ఒప్పుకున్నాడు. నాకు అంతకంటే బెటర్ హీరో దొరకడు'' అని చెప్పుకొచ్చాడు. 'ఆదిపురుష్ డ్రాఫ్ట్ నేను ఏడాది క్రితమే రాసుకున్నాను.. ఈ స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేయడానికి లాక్ డౌన్ అవకాశం కల్పించింది.. 'తన్హాజీ' తర్వాత నేను తీస్తున్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తారు. దీనిని స్టన్నింగ్ విజువల్స్ తో గ్రాండ్ గా తీయబోతున్నాం. అంతేకాకుండా ఇంతకుముందు సినిమాల్లో ఉపయోగించని ఒక టెక్నిక్‌ ని తీసుకురావాలనే ఆలోచన ఉంది'' అని ఓం రౌత్‌ పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా 'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ భారీ స్కేల్ లోనే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 'ఆదిపురుష్' ని కూడా అదే స్థాయిలో తీయడానికి మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. కరోనా కారణంగా ఫిలిం మేకర్స్ అందరూ బడ్జెట్ వ్యయాన్ని తగ్గించుకుంటుండగా.. 'ఆదిపురుష్' మాత్రం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారట. ఈ మూవీకి విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉండటం వల్ల భారతీయ చిత్రాలలో ఇంతకు ముందెన్నడూ చూడని టెక్నిక్ ని తీసుకురాబోతున్నారు. అందుకోసం ఈ సినిమా బడ్జెట్ ని రూ. 350 - రూ.400 కోట్ల వరకు ఉండనుంది. ఇదే కనుక నిజమైతే కోవిడ్ -19 తర్వాత థియేటర్లలో విడుదలయ్యే అతిపెద్ద ఇండియన్ సినిమా ఇదేనని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్స్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఏక కాలంలో తెలుగు హిందీ భాషల్లో 3డీలో రూపొందించి తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.