Begin typing your search above and press return to search.

ఆస్కార్ వేడుకలో మన లెజెండ్‌ ను గౌరవించారు

By:  Tupaki Desk   |   28 Feb 2017 5:26 AM GMT
ఆస్కార్ వేడుకలో మన లెజెండ్‌ ను గౌరవించారు
X
ఆస్కార్ వేడుకల్లో ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమా కూడా అవార్డు గౌరవాన్ని పొందలేకపోయింది. కానీ మన వాడైన ఎ.ఆర్.రెహమాన్ హాలీవుడ్ మూవీ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కు రెండు ఆస్కార్ అవార్డులు అందుకుని భారతీయులు గర్వించేలా చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ఒక భారతీయుడి పేరు ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో వినిపించింది. ఆ గౌరవం దక్కించుకున్న నటుడు.. దివంగత ఓంపురి.

మూడు నెలల కిందటే గుండెపోటుతో హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయిన దిగ్గజ నటుడు ఓంపురిని ఆస్కార్ నిర్వాహకులు స్మరించుకోవడం విశేషం. గత ఏడాది కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కాలం చేసిన సినీ ప్రముఖులకు నివాళి అర్పిస్తూ.. ఓంపురి పేరును కూడా ప్రస్తావించింది ఆస్కార్ కమిటీ. ఆయన ప్రపంచ సినిమాకు చేసిన సేవల్ని స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నట్లు పేర్కొంది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఇలాంటి గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటుడు ఓంపురినే కావచ్చేమో. దీన్ని బట్టే ఓంపురి స్థాయి ఏంటన్నది అంచనా వేయొచ్చు.

నాలుగు దశాబ్దాలకు పైగా అద్భుతమైన పాత్రలు.. అసాధారణ నటనతో భారతీయ ప్రేక్షకుల్ని అలరించిన ఓంపురి.. చనిపోయే ముందు కూడా బిజీ ఆర్టిస్టుగానే ఉన్నారు. ఆయన చేతిలో నాలుగైదు భారీ సినిమాలున్నాయి. అంత గొప్ప నటుడు.. ఇలా ఉన్నట్లుండి వెళ్లిపోవడం ఆయన అభిమానుల్ని మనోవేదనకు గురి చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/