Begin typing your search above and press return to search.

నాగుల చవితి రోజున నాగ్ ఏం చేశారంటే

By:  Tupaki Desk   |   6 Nov 2016 5:27 AM GMT
నాగుల చవితి రోజున నాగ్ ఏం చేశారంటే
X
నాగార్జున లేటెస్ట్ మూవీ ఓం నమో వెంకటేశాయ షూటింగ్ సూపర్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ని కూడా దైవకార్యం మాదిరిగా అపర భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తోంది యూనిట్. ఇప్పటికే యాదృచ్ఛికంగా జరిగిన ఎన్నో భక్తి సంబంధిత సంఘటనలను పంచుకుంది కూడా.

'ఓం నమో వెంకటేశాయ సెట్స్ లో మరో యాదృచ్ఛికం. వేంకటేశ్వర స్వామి వారిపై గల సన్నివేశాలను అనుకోకుండా నాగుల చవితి రోజునే చిత్రీకరించారు' అంటూ ఓ ఫోటోను కూడా పోస్ట్ చేసింది యూనిట్. స్వామి వారు పుట్టలోనే కొన్ని రోజులు ఉండిపోవాల్సి వచ్చే ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. అప్పుడు ఆయన ఆకలి తీర్చేందుకు ఒక గోవు.. పుట్టపై నుంచి తన పొదుగులోని పాలని స్వామి వారి నోట పడేలా జారవిడుస్తుంటుంది. ఈ ఎపిసోడ్ నే నాగుల చవితి రోజున చిత్రీకరించారన్న మాట.

నాగుల చవితికి.. ఈ ఎపిసోడ్ కి లింక్.. వేంకటేశుడు ఆ సమయంలో పుట్టలో ఉండడమే. అయితే.. వేంకటేశుని లుక్ విషయంలో మాత్రం సౌరభ్ రాజ్ జైన్ సూపర్బ్ గా ఉన్నాడనే చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/