Begin typing your search above and press return to search.

నాగ్ భక్తి చిత్రం 2 మిలియన్లు రాబట్టాలా!!

By:  Tupaki Desk   |   11 Sep 2016 7:05 AM GMT
నాగ్ భక్తి చిత్రం 2 మిలియన్లు రాబట్టాలా!!
X
అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓం నమో వేంకటేశాయ. శ్రీనివాసుని పరమభక్తుడు అయిన హథీరాం బాబాజీ పాత్రలో నాగ్ నటిస్తున్నాడు. ఇప్పటికే నాగార్జునతో పాటు ప్రధాన పాత్రధారుల ఫస్ట్ లుక్స్ అన్నీ దాదాపుగా వచ్చేశాయి. ఓం నమో వెంకటేశాయ షూటింగ్ సగానికి పైగా పూర్తయిపోయిందని.. నాగార్జున రీసెంట్ గా చెప్పేశాడు కూడా.

నాగ్- కె. రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ భక్తిరస చిత్రంపై ఇండస్ట్రీలో బోలెడంత ఆసక్తి కనిపిస్తోంది. అన్నమయ్య నుంచి వీరి కాంబోలో వచ్చిన భక్తి చిత్రాలన్నీ వరుసగా మంచి హిట్స్ సాధించడం.. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిపై సినిమా కావడంతో.. ఈ చిత్రంపై టాలీవుడ్ లో మంచి బజ్ ఉంది. అందుకే ఈ సినిమాకి బిజినెస్ కూడా భారీగానే జరుగుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే రికార్డు ధరలకు ఓం నమో వెంకటేశాయ రైట్స్ విక్రయించారని తెలుస్తోంది. ఏకంగా 6 కోట్ల రూపాయలు ఈ భక్తి మూవీపై డిస్ట్రిబ్యూటర్లు పెట్టేశారు.

ఇంత మొత్తం రికవర్ కావాలంటే దాదాపు 2 మిలియన్ డాలర్లు గ్రాస్ రూపంలో రావాల్సి ఉంటుంది. అయితే.. రీసెంట్ గా నాగ్ ట్రాక్ రికార్డు ఇక్కడ అద్భుతంగా ఉంది. సోగ్గాడే చిన్ని నాయన.. ఊపిరి మూవీలు మంచి సక్సెస్ సాధించాయి. వీటికి తోడు వెంకటేశుని సినిమా. యూఎస్ లో తెలుగు జనాలను థియేటర్లకు రప్పించడానికి ఈ మాత్రం చాలని భావించిన డిస్ట్రిబ్యూటర్.. ఎక్కువ ఆఫర్ చేసేందుకు ఏ మాత్రం వెనకాడలేదని చెప్పచ్చు.