Begin typing your search above and press return to search.
నాగ్ సినిమాలో స్వామి సాక్షాత్కారం
By: Tupaki Desk | 30 July 2016 8:10 PM ISTఈ ఏడాది ఇప్పటికే వరుసగా రెండు హిట్స్ సాధించిన ఊపులో ఉన్న అక్కినేని నాగార్జున మూడో మూవీ కోసం రూట్ మార్చి భక్తి బాట పట్టేశారు. వెంకటేశ్వర స్వామి అపర భక్తుడు హథీరాం బాబాగా నాగ్ నటిస్తుండగా.. ఈ మూవీలో వెంకటేశ్వర స్వామిని చూపించేశారు దర్శకుడు రాఘవేంద్ర రావు. 'స్వామి ఆవిష్కరణ' అంటూ ఓ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
ఓం నమో వెంకటేశాయ టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో హిందీ నటుడు సౌరభ్ రాజ్ జైన్ వెంకటేశ్వర స్వామిగా నటిస్తున్నాడు. ఇప్పటికే పలు హిందీ సీరియల్స్ లో దేవుడి పాత్రలతో మెప్పించిన ఇతన్ని తొలిసారిగా తెలుగు స్క్రీన్ పై దేవుడిగా చూపిస్తున్నారు. వెంకన్నగా సౌరభ్ ను చూపుతున్న మోషన్ పోస్టర్ విడుదలైంది. గతంలో సీనియర్ నటుడు సుమన్ ను దేవుడిపాత్రలో చూపించిన దర్శకుడు రాఘవేంద్ర రావు ఈసారి మాత్రం బాలీవుడ్ నటుడిని తీసుకొచ్చారు.
అయితే.. ఆ పాత్రలో సౌరభ్ సరిగ్గా సరిపోయాడనే చెప్పాలి. గతంలో మహావిష్ణువు పాత్ర చేసి మెప్పించిన సౌరభ్ రాజ్ జైన్ కి.. వెంకటేశ్వరస్వామి గెటప్.. మేకప్.. సరిగ్గా సరిపోయాయి. ఏమైనా కొత్త దేవుడు బావున్నాడని అనాల్సిందే.
