Begin typing your search above and press return to search.

ఒకపక్క మాస్ మరోపక్క క్లాస్.. హౌస్ ఫుల్స్

By:  Tupaki Desk   |   10 Feb 2017 6:50 AM GMT
ఒకపక్క మాస్ మరోపక్క క్లాస్.. హౌస్ ఫుల్స్
X
సాధారణంగా మాస్ ప్రేక్షకులు, క్లాస్ వీక్షకులు ఒకే వీకెండ్ లో విడుదలైన సినిమాలకు సంతృప్తి చెందిన సందర్భాలు చాలా తక్కువ. అయితే చాలా రోజుల తరువాత రెండు పెద్ద సినిమాల కారణంగా ఇప్పుడీ సందడి బాక్స్ ఆఫీస్ వద్ద నెలకొంది. విశేషమేంటంటే విడుదలైన రెండు సినిమాలూ మంచి టాక్ ని సొంతం చేసుకోవడం.

గురువారం తమిళ తెలుగు బాషలలో విడుదలైన సింగం 3 మాస్ లో మంచి టాక్ ని తెచ్చుకుంది. సూర్య, హరిల కాంబినేషన్ నుండి, సింగం సిరీస్ నుండి ఏమైతే ఆశిస్తారో అవన్నీ విందుభోజనంగా అందించడంతో రెండు భాషల్లో రికార్డు ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. సూర్య గతకొన్ని చిత్రాలుగా ఎదురుచూస్తున్న విజయాన్ని సొంతం చేసుకోవడంతో పరమానందంలో వున్నాడు.

ఇక భక్తిరస ప్రధాన నవరసాత్మక చిత్రంగా ఈరోజు విడుదలైన ఓం నమో వెంకటేశాయ సినిమా ప్రీమియర్ షోలనుండే అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకుంది. రాఘవేంద్రరావు టేకింగ్ - కీరవాణి కంపోజింగ్ - నాగ్ యాక్టింగ్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిన్నట్టు సమాచారం. మాస్ ని ఇష్టపడే వాళ్ళు సింగంవైవు పరుగులు తీస్తే క్లాస్ ఆడియన్స్ వెండితెర వేంకటేశుని చెంతకు చేరతారు. సినీ ప్రియులకు మాత్రం 'రెండు' కనుల పండుగే


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/