Begin typing your search above and press return to search.

బాల‌య్యా మ‌జాకా..విజిల్స్..డ్యాన్స్ తో బామ్మ హ‌ల్ చ‌ల్!

By:  Tupaki Desk   |   26 July 2022 8:35 AM GMT
బాల‌య్యా మ‌జాకా..విజిల్స్..డ్యాన్స్ తో బామ్మ హ‌ల్ చ‌ల్!
X
నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. 107వ సినిమాగా అత్యంత భారీ స్థాయిలో హై వోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నారు. 'అఖండ‌'తో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న బాల‌య్య తాజా ప్రాజెక్ట్ తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ పై క‌న్నేశారు. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో హీరో బాల‌కృష్ణ టు డైమెన్ష‌న్స్ వున్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈమూవీని నిర్మ ఇస్తోంది.

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో బాల‌య్య లుంగీ ధ‌రించిన క‌నిపించిన తీరు విశేషంగా ఆక‌ట్టుకుంది. అంతే కాకుండా రీసెంట్ గా ఫ‌స్ట్ హంట్ పేరుతో విడుద‌ల చేసిన టీజ‌ర్ అంచ‌నాల్ని మ‌రింత పెంచేసి బాల‌య్య అభిమానుల‌కు పూన‌కాలు తెప్పించింది. ఇదిలా వుంటే ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం క‌ర్నూలు లో జ‌రుగుతోంది. సీమ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాల‌య్య‌కు క‌ర్నూల్ బాగా క‌లిసి వ‌చ్చింద‌ని చెప్పాలి.

దీంతో మ‌రోసారి గోపీచంద్ మ‌లినేని సినిమా కోసం క‌ర్నూలులో అడుగుపెట్టారు బాల‌య్య. అక్క‌డి కొండా రెడ్డి బురుజు స‌మీపంలో బాల‌య్య‌, శృతిహాస‌న్ పాల్గొన‌గా ఓ శ‌వ యాత్ర‌కు సంబంధించిన ఘ‌ట్టాల‌ని ద‌ర్శ‌కుడు గోపీచంద్ చిత్రీక‌రిస్తున్నారు.

అయితే ఈ స‌న్నివేశాల్లో బాల‌య్య యువ‌కుడిగా ఖాకీ క‌ల‌ర్ ష‌ర్ట్ థిక్ బ్లూ జీన్స్ ధ‌రించి క‌నిపిస్తున్నారు. ప‌క్క‌నే వైట్ చుడీదార్ లో హీరోయిన్ శృతిహాస‌న్ క‌నిపిస్తోంది. క‌థాను సారం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి సంబంధించిన ఘ‌ట్టాలుగా ఈ స‌న్నివేశాల‌ని భావిస్తున్నారు.

ఇదిలా వుంటే కొండారెడ్డి బురుజు స‌మీపంలో బాల‌య్య సినిమా షూటింగ్ జ‌రుగుతున్న విష‌యాన్ని తెలుసుకున్న సామాన్యులు తండోప‌తండాలుగా అక్క‌డికి చేరుకున్నారు. జై బాల‌య్య జై బాల‌య్య అంటూ నినాదాలు చేశారు. అయితే ఓ బామ్మ మాత్రం షూటింగ్ స్పాట్ వ‌ద్ద విజిల్స్ వేస్తూ షుషారుగా డాన్స్ చేస్తూ హోరెత్తించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.

బాల‌య్య ఫ్యాన్స్ ఈ వీడియోని నెట్టింట షేర్ చేస్తూ మ‌రింత వైర‌ల్ చేస్తున్నారు. హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీలో క‌న్న‌డ హీరో దునియా విజ‌య్ విల‌న్ గా న‌టిస్తుండ‌గా వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. హ‌నీ రోజ్‌, లాల్‌, చంద్రికా ర‌వి ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం రిషీ పంజాబీ, సంగీతం త‌మ‌న్‌, ఎడిటింగ్ న‌వీన్ నూలి, సంభాష‌ణ‌లు సాయి మాధ‌వ్ బుర్రా.