Begin typing your search above and press return to search.

ట్రైలర్: ఆద్యంతం నవ్వులు పూయిస్తోన్న 'ఓల్డ్ మాంక్'

By:  Tupaki Desk   |   27 Aug 2021 10:30 AM GMT
ట్రైలర్: ఆద్యంతం నవ్వులు పూయిస్తోన్న ఓల్డ్ మాంక్
X
ఇటీవల కాలంలో అనేక కన్నడ చిత్రాలు తెలుగులోకి అనువాదం చేయబడ్డాయి. కొన్ని ఓటీటీలో విడుదలైతే.. మరికొన్ని థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్టుగా ''ఓల్డ్‌ మాంక్‌'' అనే కన్నడ డబ్బింగ్ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నడ నటుడు శ్రీని స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ను యువ హీరో నవీన్‌ పొలిశెట్టి విడుదల చేశారు.

ఒకానొక కాలంలో నారదుడిని శ్రీకృష్ణ పరమాత్మ శపించాడని చెప్పడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. 'నువ్వు భూలోకంలో పుట్టి, ఒక అమ్మాయిని లవ్‌ చేసి, వాళ్ల ఇంట్లో వాళ్లందరినీ ఒప్పించి, అదే అమ్మాయిని ఏ రోజైతే పెళ్లి చేసుకుంటావో అప్పుడే నీకు శాప విమోచనం అవుతుంది' అని నారదుడిని శ్రీకృష్ణుడు శపించినట్లు తెలిపారు. ఈ విధంగా భూలోకంలో అప్పన్న అనే యువకుడిగా పుట్టిన నారదుడు.. తనకు లవర్ దొరికి పెళ్లి అయ్యే వరకు ప్రేమికులు ఎవరినీ హ్యాపీగా ఉండనివ్వని శపథం చేసాడు. ఈ క్రమంలో ఓ విలన్ ని కూడా ఎదుర్కోబోతున్నాడని అర్థం అవుతోంది.

నారదుడు ఏ అమ్మాయిని ప్రేమించాడు? శాప విమోచనం పొందాడా లేదా? అనేది తెలియాలంటే ''ఓల్డ్‌ మాంక్‌'' సినిమా చూడాల్సిందే. ఫన్నీగా సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ముఖ్యంగా ఓల్డేజ్ లవర్స్ హోమ్ అంటూ వృద్ధాశ్రమంలో చోటుచేసుకునే సన్నివేశాలు.. ఒన్ లైన్ పంచ్‌ డైలాగ్‌ లు నవ్వులు పంచుతున్నాయి. క్లాప్‌ బోర్డ్ ప్రొడక్షన్స్‌ - స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఆర్‌కె నల్లం - రవి కశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.