Begin typing your search above and press return to search.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 'ఒక్కడు' రికార్డ్..!

By:  Tupaki Desk   |   9 Jan 2023 12:30 AM GMT
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఒక్కడు రికార్డ్..!
X
రీ రిలీజ్ హంగామా నడుస్తున్న టాలీవుడ్ లో ఈమధ్యనే ఖుషి రిలీజ్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి ఖుషిగా ఉండగా లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ ఒక్కడు రిలీజ్ తో ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు. జనవరి 7న మహేష్ ఒక్కడు రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ అవగా థియేటర్ల దగ్గర మహేష్ ఫ్యాన్స్ సందడి ఓ రేంజ్ లో ఉంది. ఇదిలాఉంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహేష్ స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. రీ రిలీజ్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహేష్ ఒక్కడు రికార్డ్ కలెక్షన్స్ సాధించింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్ లో మహేష్ ఒక్కడు సినిమా 16.93 లక్షలు ఒక్కరోజులో కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు రీ రిలీజైన ఏ మూవీకి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రాలేదని తెలుస్తుంది. మరోసారి బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ స్టామినా ప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు. మహేష్ ఫ్యాన్స్ కి ఒక్కడు సినిమా అంటే విపరీతమైన క్రేజ్. ఆ సినిమాలో మహేష్ నటన కూడా నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.

ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ సినిమాను గుణశేఖర్ డైరెక్ట్ చేశారు. సినిమాలో మహేష్ కబడ్డీ ఆటగాడి గా కనిపిస్తారు. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. సినిమాలో ప్రతి అంశం అలా పర్ఫెక్ట్ గా కుదరడంతో మహేష్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా ఒక్కడు నిలిచింది. అంతేకాదు చాలామంది దర్శకులు అవ్వాలనుకునే వారికి ఈ సినిమా ఒక మార్గదర్శకంగా నిలిచింది. ఈ సినిమాతోనే మహేష్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఒక్కడు సినిమా మహేష్ కెరీర్ ని టర్న్ చేసింది. అప్పటివరకు ఫ్యామిలీ హీరోగా ఉన్న మహేష్ కి ఈ సినిమాతో మాస్ ఇమేజ్ రావడం.. సెపరేట్ ఫ్యాన్స్ ఏర్పడడం జరిగింది. సినిమాలో అజయ్ పాత్రలో మహేష్ అదరగొట్టాడు. మహేష్, భూమికల జోడీ కూడా సినిమాలో హైలెట్ గా నిలిచింది. సినిమా అంతా కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ అయ్యేలా చేసి దర్శకుడిగా గుణశేఖర్ తన ప్రతిభ చాటారు. ఈ సినిమా కోసం తోట తరణి వేసిన సెట్స్ గురించి కూడా అప్పట్లో చాలా స్పెషల్ గా మాట్లాడుకున్నారు.