Begin typing your search above and press return to search.

మెగా డాటర్ ఆడియోపై కొత్త నిర్ణయం

By:  Tupaki Desk   |   19 April 2016 7:56 AM GMT
మెగా డాటర్ ఆడియోపై కొత్త నిర్ణయం
X
మెగా డాటర్ కొణిదెల నీహారిక హీరోయిన్ నటించిన తొలి మూవీ 'ఒక మనసు'. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగ శౌర్య హీరోగా నటించాడు. మెగా బ్రదర్ నాగబాబు కూతురు హీరోయిన్ గా అరంగేట్రం చేస్తున్న సినిమా కావడంతో.. ఒక మనసుపై ఇండస్ట్రీలో చాలానే ఆసక్తి నెలకొంది. ఒక మనసు చిత్రం షూటింగ్ మార్చ్ నెలలోనే పూర్తయిపోయింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ లెవెల్ లో చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల చివరి వారంలోనే ఒక మనసు ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరగాల్సి ఉంది. మెగాస్టార్ సహా మెగా ఫ్యామిలీ హీరోలంతా ఈ ఈవెంట్ కు హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఇప్పుడీ మూవీ ఆడియో విడుదల వేడుకను వాయిదా వేసుకున్నారు నిర్మాతలు. ఈ నెల చివరి వారంలో జరపాల్సిన ఫంక్షన్ ను... మే నెల 2వ వారంలో చేయాలని నిర్ణయించారు. ఆడియో విడుదల వాయిదాకు కారణాలను మాత్రం నిర్మాతలు చెప్పలేదు.

మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు వంటి కంటెంట్ బేస్డ్ చిత్రాన్ని రూపొందించిన రామరాజు ఒక మనసుకు దర్శకత్వం వహించాడు. మధుర శ్రీధర్ తో పాటు, న్యూస్ ఛానల్ టీవీ9 కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. మే నెల రెండో వారంలో ఆడియో విడుదల చేసి, చివరివారం నాటికి సినిమా రిలీజ్ చేయాలన్నది నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది.