Begin typing your search above and press return to search.

ఏం బిల్డప్ ఇచ్చావ్ ఓంకార్ అన్నయ్యా

By:  Tupaki Desk   |   5 March 2018 4:36 PM GMT
ఏం బిల్డప్ ఇచ్చావ్ ఓంకార్ అన్నయ్యా
X
టీవీ యాంకర్ గా కెరీర్ ను పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిన అన్నయ్య అలియాస్ ఓంకార్.. ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ అయిపోయాడు. మొదటి సినిమా డింకీ కొట్టినా.. రెండో సినిమా రాజుగారి గదితో బ్లాక్ బస్టర్ కొట్టాడు. తర్వాత అదే సినిమాకు చేసిన సీక్వెల్.. స్టార్ క్యాస్టింగ్ ఉన్నా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ డైరెక్టర్ కం టీవీ హోస్ట్.. మరో కొత్త రియాల్టీ షోతో జనాల ముందుకు వచ్చేస్తున్నాడు.

'సిక్త్స్ సెన్స్' అనే టైటిల్ పై కొత్త టీవీ షో చేస్తున్నాడు ఓంకార్. స్టార్ మా ఛానల్ లో త్వరలో ఈ కార్యక్రమం ప్రసారం కానుండగా.. ఇప్పుడీ షో ట్రైలర్ ను మాస్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా లాంఛ్ చేయించాడు. ఓంకార్ ఇప్పుడు ఫిలిం పర్సనాలిటీ కూడా కావడంతో.. ఇటు నుంచి కూడా సపోర్ట్ బాగానే వస్తోంది. అయితే.. ఈ ట్రైలర్ ను చూడాలి.. నా సామి రంగా.. ఏ టాప్ మోస్ట్ హీరోతో చేసిన కార్యక్రమానికి తీసిపోని రేంజ్ లో కట్ చేశారు.

సిక్త్స్ సెన్స్ ట్రైలర్ మొత్తం ఎలివేషన్ షాట్స్ తోనే సరిపోయిందంటే ఆశ్చర్యం వేయక మానదు. అలాగని అవేమీ సోసోగా కూడా లేవు. చాలా గ్రాండ్ గానే రూపొందించారు. మొత్తం ట్రైలర్ పర్ఫెక్ట్ గానే కుదిరింది. ముందుగా డీటైల్ తెలియకుండా ఈ ప్రోమో చూసిన వాళ్లు.. చివరలో ఐయాం బ్యాక్ అంటూ దర్శనం ఇచ్చిన ఓంకార్ ను చూసి.. ఏం బిల్డప్ ఇచ్చావ్ ఓంకార్ అన్నయ్యా అనుకోక మానరు.