Begin typing your search above and press return to search.

బేబీకి స్పైడర్ మ్యాన్ బ్రేకులు

By:  Tupaki Desk   |   6 July 2019 4:25 AM GMT
బేబీకి స్పైడర్ మ్యాన్ బ్రేకులు
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మంచి సినిమా అయినా ఎంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఫస్ట్ వీకెండ్ తో పాటు మొదటి పది రోజుల వసూళ్లు చాలా కీలకంగా మారుతున్నాయి. అందులోనూ మీడియం రేంజ్ మూవీస్ కి ఇది కత్తి మీద సవాల్ గా ఉంటుంది. నిన్న విడుదలైన ఓ బేబీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఉన్నా సమంతా పెర్ఫార్మన్స్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ బాగుండటంతో మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది.

హైదరాబాద్ విజయవాడ లాంటి ఏ సెంటర్స్ లో ఈ మూడు రోజులు దాదాపుగా అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడే పరిస్థితి కనిపిస్తోంది. బిసి కేంద్రాల్లో మాత్రం ఇంత రెస్పాన్స్ లేదు కాని డీసెంట్ గానే కలెక్షన్లు రికార్డు అవుతున్నాయి. కాని ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఓ బేబీకి స్పైడర్ మ్యాన్ నుంచి సవాల్ ఎదురవుతోంది. ఓ బేబీకి సరిగ్గా ఒక్క రోజు ముందు విడుదలైన స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రం హోం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు వెర్షన్ కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయడంతో యూత్ తో పాటు పిల్లలు దీనికి క్యు కడుతున్నారు.

వారాంతంలో కుటుంబంతో కలిసి ఒక్క సినిమా మాత్రమే చూసే వెసులుబాటు ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లల కోరిక మేరకు స్పైడర్ మ్యాన్ కు ఓటు వేయాల్సి వస్తోందట. పెద్దలకు ఓ బేబీ మీద మనసు లాగుతున్నా పిల్లపిడుగుల బలవంతం మేరకు షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి. ఇది ఎంత వరకు ప్రభావం చూపబోతోంది అనేది సోమవారం ఉదయానికి వచ్చే ఓ బేబీ కలెక్షన్ రిపోర్ట్ తో పాటు వీక్ డేస్ లో వసూళ్లు ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇంకేది పెద్దగా పోటీ ఇవ్వనప్పటికీ విచిత్రంగా హాలీవుడ్ మూవీ నుంచి ఓ బేబీకి ఛాలెంజ్ ఎదురుకావడం గమనార్హం