Begin typing your search above and press return to search.
ఇప్పట్లో థియేటర్లు అన్ లాక్ అయ్యేనా?
By: Tupaki Desk | 6 July 2021 9:00 AM ISTతెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 వరకూ శరతులు లేకుండా స్వేచ్ఛకు అనుమతులున్నాయి. అలాగే థియేటర్లు తెరుచుకోవచ్చని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అనుమతులిచ్చాయి. అయితే ఇప్పటివరకూ థియేటర్లు మాత్రం అన్ లాక్ కాలేదు. ముఖ్యంగా తెలంగాణలో లాక్ డౌన్ లేకపోయినా అక్కడి యాజమాన్యాలు థియేటర్లు తెరవడానికి ఆసక్తి చూపించలేదు. ఈ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యలతో ప్రభుత్వ అధికారులు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్- నిర్మాతలు సురేష్ బాబు- దామోదర్ ప్రసాద్- దిల్ రాజు తదితరులు అధికారులతో సమావేశమయ్యారు.
ఈ భేటిలో సోమేష్ కుమార్ థియేటర్లు ఎందుకు తెరవలేదని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో థియేటర్లు ఓపెన్ చేస్తే తలెత్తె ఇబ్బందులను నిర్మాతలు అధికారులకు వివరించినట్లు తెలుస్తోంది. ఏపీలో కర్ఫ్యూ నేపథ్యంలో తెలంగాణలో రిలీజ్ చేస్తే భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉందని వివరించినట్లు సమాచారం. ఆంధ్రాలో ఓపెన్ చేస్తే తప్ప తెలంగాణలో రీ ఓపెన్ చేయలేమని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే థియేటర్లో పెయిడ్ పార్కింగ్ కు ప్రభుత్వం అనుమతిని కోరారు. పెయిండ్ పార్కింగ్ వల్ల 40 శాతం థియేటర్ యాజమాన్యాలకు ఆదాయం ఉంటుందని అలాగే చిన్న సినిమా నిర్మాతలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
అలాగే ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ చేస్తే నష్టాలొస్తాయని వివరించినట్లు సమాచారం. ఇలా చేయడంలో వల్ల గతంలో ఎదురైన అనువాల్ని అధికారుల ముందు ఉంచారు. వీటన్నింటిని బేరీజు వేసుకుని యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనిపించలేదు. కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. థర్డ్ వేవ్ సెప్టెంబర్ ..అక్టోబర్ లో మొదలవుతుంది. అంటే కేవలం రెండు నెలలు సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని కొన్ని సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. కానీ ఇంతలోనే కొత్త సమస్యలు థియేటర్లను తెరిచేందుకు అననుకూలతను సృష్టిస్తున్నట్టే కనిపిస్తోంది.