Begin typing your search above and press return to search.

అఫీషియల్ : పవన్26 రిలీజ్ డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   3 Feb 2020 6:29 AM GMT
అఫీషియల్ : పవన్26 రిలీజ్ డేట్ ఫిక్స్
X
ఇటీవలే సెట్స్ పైకి వచ్చిన 'పింక్' రీమేక్ లో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కోసం ఇప్పటి నుండే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. మే 15న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అఫీషియల్ గా ప్రకటించాడు నిర్మాత దిల్ రాజు.

పవన్ కి మే సెంటిమెంట్ ... పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ మే 11 న విడుదలైన సంగతి తెలిసిందే. అందుకే అదే నెలలో ఈ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే డేట్ ను లాక్ చేసుకొని ఆ డేట్ కి రీచ్ అయ్యేలా షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు.

ఇక పవన్ తో సినిమా చేయాలనే తన డ్రీమ్ ఓ రీమేక్ వల్ల దక్కడం సంతోషమని టైటిల్ తో పాటు ఫస్ట్ లుల్ ను ఉగాది సందర్భంగా రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా తెలిపాడు దిల్ రాజు. ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. మరి అదే టైటిల్ తో సినిమా వస్తుందా లేదా తెలియాలంటే ఉగాది వరకూ వేచి ఉండాల్సిందే. బోణీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీ రామ్ దర్శకుడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.