Begin typing your search above and press return to search.

#Jr NTR30 వేట్రిమార‌న్ కి గురూజీ చెక్!

By:  Tupaki Desk   |   19 Feb 2020 9:58 AM IST
#Jr NTR30  వేట్రిమార‌న్ కి గురూజీ చెక్!
X
స్టార్ హీరోల‌తో ఒక్క ఛాన్స్ అంటూ ద‌ర్శ‌కులు.. నిర్మాత‌లు పోటీప‌డ‌డం చూస్తున్న‌దే. ప్ర‌స్తుతం #Jr NTR30 కోసం ఇరువురు నిర్మాత‌లు పోటీ ప‌డుతున్నార‌ని.. దానివ‌ల్ల బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య చిక్కులొచ్చాయ‌ని ప్ర‌చార‌మైంది. తార‌క్ 30 కోసం క‌ళ్యాణ్ రామ్ కాపు కాసుకుని కూచుకుంటే గురూజీ త్రివిక్ర‌మ్ చ‌క్రం తిప్పి హారిక అండ్ హ‌సినికి ఆ ఛాన్స్ ద‌క్కేలా చేశాడ‌ని దాంతో క‌ల‌త‌లు త‌ప్ప‌లేద‌ని ప్ర‌చార‌మవుతోంది. అదంతా అటుంచితే.. తార‌క్ కి లైన్ వినిపించి ఓకే చేయించుకున్న త‌మిళ ద‌ర్శ‌కుడు వేట్రిమార‌న్ కి గురూజీ ఓ రేంజు లో ఝ‌ల‌క్ ఇచ్చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌ల‌ `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ లో బిజీగా ఉన్నా అత‌డు న‌టించే త‌దుప‌రి చిత్రానికి సంబంధించిన ప్ర‌చారం టాలీవుడ్ స‌ర్కిల్స్ ని హీటెక్కిస్తోంది. ఈ సినిమా త‌ర్వాత గురూజీ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ న‌టిస్తార‌ని ప్ర‌చారం సాగింది. అయితే ఇంత‌లోనే జాతీయ అవార్డు దర్శ‌కు డు..త‌మిళుడు వేట్రిమార‌న్ కూడా తార‌క్ కి స్టోరీ వినిపించి లాక్ చేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చార‌మైంది. గురూజీ త్రివిక్ర‌మ్ వినిపించిన స్క్రిప్టుని మించి డిఫ‌రెంట్ జాన‌ర్ క‌థాంశం కావ‌డంతో తార‌క్ వేట్రి మార‌న్ కే ఖాయం చేశాడ‌న్న క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే ఈ ప్ర‌చారానికి చెక్ పెడుతూ త్రివిక్రమ్ అధికారిక ప్ర‌క‌ట‌న‌కు ప్లాన్ చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

ఈ బుధ‌వారం ఎన్టీఆర్ 30 టైటిల్ ను అధికారికంగా ప్ర‌క‌టించేందుకు మాయావి త్రివిక్ర‌మ్ సిద్ధ‌మ‌వుతున్నారు. అంటే త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ ముందుగా సెట్స్ కు వెళ్ల‌డం ఖాయ‌మైన‌ట్టే. అలాగే తార‌క్ జోడీగా కూర్గ్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న‌ను గురూజీ ఎంపిక చేసారు. అలాగే టైటిల్ పైనా ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా లో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. `అయిన‌ను పోయి రావ‌లె హ‌స్తిన‌కు` అనే టైటిల్ ని ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది.

అయితే నిన్న‌టివ‌ర‌కూ సైలెంట్ గా ఉన్న త్రివిక్ర‌మ్ ఇంత హ‌డావుడిగా ప్రాజెక్ట్ ను ఎందుకు మూవ్ చేస్తున్న‌ట్లు? అంటే .. వేట్రిమార‌న్ దూకుడుకు చెక్ పెట్టాల‌నేనా? అన్న సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు. తార‌క్- వేట్రి ప్రాజెక్టుపై సోష‌ల్ మీడియా క‌థ‌నాలు కూడా గురూజీపై ఇంపాక్ట్ చూపించాయ‌న్న అంచ‌నా వేస్తున్నారు. తార‌క్ చేజారిపోతాడు! అన్న టెన్ష‌న్ తోనే మాయావి ఇలా అధికారిక ప్ర‌క‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న మాటా వినిపిస్తోంది. ఇంత‌కీ తార‌క్ కాల్షీట్లు లాక్ చేశారా లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది. తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి గురూజీ త‌ర్వాత ఎన్టీఆర్ 31 కోసం వేట్రిమార‌న్ వెయిట్ చేయాల‌న్న‌మాట‌!