Begin typing your search above and press return to search.

ప్లాప్ డైరెక్టర్ తో 20వ సినిమా చేస్తాడా..?

By:  Tupaki Desk   |   15 April 2020 3:00 PM IST
ప్లాప్ డైరెక్టర్ తో 20వ సినిమా చేస్తాడా..?
X
టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుండి నాగచైతన్య ఒక్కడే సక్సెస్ ఫుల్ హీరోగా ఫామ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా చైతన్య 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు. కరోనా లేకపోతే ఈపాటికి లవ్ స్టోరీ షూటింగ్ ముగించుకొని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యేది. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి ధాటికి షూటింగులు ఆగిపోవ‌డంతో సినిమా నిలిచిపోయింది. చైతూ ఈ సినిమాను పూర్తి చేసి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా మొద‌లుపెట్టాల్సింది. కానీ ఆ ప్లాన్ కూడా ఫ‌లించ‌లేదు. పరశురామ్ కి అనుకోకుండా మ‌హేష్ బాబుతో సినిమా చేసే అవ‌కాశం రావడంతో ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడట.

అనంతరం మ‌నం లాంటి మ‌ర‌పురాని సినిమాను అందించిన విక్ర‌మ్ కుమార్ క‌నిపించాడట చైతూ. కొన్ని రోజులుగా వీరి మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయని వినికిడి. తాజా స‌మాచారం ప్ర‌కారం చైతూ-విక్ర‌మ్ మ‌ధ్య సినిమా చేయ‌డానికి అంగీకారం కుదిరిందట. క‌థా చ‌ర్చ‌లలో ఉండగానే స్క్రిప్టు ఫైనల్ కూడా అయిన‌ట్లు తెలిసింది. ఇది గనుక ఓకే అయితే చైతూకిది 20వ సినిమా అవుతుంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ త‌న‌కు ఇప్ప‌టికే ఓ క‌మిట్మెంట్ ఉన్న దిల్ రాజు బేన‌ర్లో చైతూ ఈ సినిమా చేయ‌నున్నాడు. మ‌నం త‌ర్వాత విక్ర‌మ్ నుంచి ఆయ‌న భారీ హిట్స్ రాలేదు. గ్యాప్ తీసుకొని రూపొందించిన హ‌లో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్ట‌ర్ అయింది. గ్యాంగ్ లీడ‌ర్ కూడా అనుకున్నంత‌గా ఆడ‌లేదు. ప్ర‌స్తుతం చేస్తున్న నాగచైతన్య ల‌వ్ స్టోరీ ప్రామిసింగ్‌గా క‌నిపిస్తోందట. ఈ వ‌రుస‌లో విక్ర‌మ్ సినిమా కూడా క్లిక్ అయితే అత‌ను మ‌రో స్థాయికి వెళ్ల‌డం ఖాయమే అన్పిస్తుంది. మరి చైతూ.. తన 20వ సినిమాను ఏదైనా కొత్త ప్లాన్ తో వస్తాడో.. చూడాలి!