Begin typing your search above and press return to search.

'ఏక్ మినీ క‌థ' డైరెక్ట‌ర్ ని చుట్టుముడుతున్న ఆఫ‌ర్స్..!

By:  Tupaki Desk   |   4 Jun 2021 12:30 AM GMT
ఏక్ మినీ క‌థ డైరెక్ట‌ర్ ని చుట్టుముడుతున్న ఆఫ‌ర్స్..!
X
యువ హీరోహీరోయిన్లు సంతోష్‌ శోభన్‌ - కావ్య థాపర్ జంటగా రూపొందిన లేటెస్ట్ మూవీ ''ఏక్‌ మినీ కథ''. కొత్త దర్శకుడు కార్తీక్ రాపోలు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ రూపొందించింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటీటీ విధానంలో ఈ సినిమా విడుదలైంది. ఇప్ప‌టి వరకు తెలుగు తెర మీద చూడ‌ని ఒక బోల్డ్ కాన్సెప్ట్‌ తో వచ్చిన ఈ సినిమా మంచి వ్యూయర్ షిప్ రాబట్టి సూపర్ హిట్ అయింది.

దర్శకుడు మేర్లపాక గాంధీ అందించిన వైవిధ్యమైన కథను డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ, కార్తీక్ రాపోలు డీల్ చేసిన విధానానికి ప్రశంసలు దక్కుతున్నాయి. కొత్త వాడైనా బోల్డ్ పాయింట్ ని ఎక్కడా హద్దులు దాటకుండా తడబడకుండా.. వినోదాన్ని పండించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో బోల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని అందించిన ఈ దర్శకుడికి ఇప్పుడు వరుస ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ - ఎస్.ఆర్.టి ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో సినిమాలు చేయాల్సిందిగా కార్తీక్ రాపోలుకి ప్ర‌పోజ‌ల్స్ వస్తున్నాయట. అలానే యూవీ కాన్సెప్ట్స్ లో మరో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరికొన్ని నిర్మాణ సంస్థలు కూడా యువ దర్శకుడితో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కార్తీక్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ తదుపరి ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది. అది కూడా ఓ ఛాలెంజింగ్ స్క్రిప్ట్ తో రాబోతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.