Begin typing your search above and press return to search.

మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో కియారా అద్వానీ

By:  Tupaki Desk   |   10 Dec 2020 3:00 PM IST
మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో కియారా అద్వానీ
X
ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో కియారా అద్వానీ చేరింది అనడంలో సందేహం లేదు. ఏడాదిలో నాలుగు అయిదు పెద్ద సినిమాల్లో నటిస్తున్న కియారా అద్వానీ క్రేజ్‌ అంతకంతకు పెరుగుతూనే ఉంది. నటిగా మంచి ప్రతిభ కనబర్చడంతో పాటు ఎలాంటి పాత్రలను అయినా చేసేందుకు సిద్దంగా ఉండే ఆమె తత్వం అందాల ప్రదర్శణ విషయంలో వెనక్కు తగ్గక పోవడం వల్ల ముద్దుగుమ్మ కియారా అద్వానీకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ వెయిటింగ్ మూవీలో అవకాశం దక్కించుకుంది.

బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు యావత్‌ దేశ సినీ అభిమానులు ఎదురు చూస్తున్న 'క్రిష్‌ 4' సినిమా లో ఈమెకు అవకాశం దక్కింది. హృతిక్‌ రోషన్‌ హీరోగా రూపొందబోతున్న ఈ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో ఆమె ఒక హీరోయిన్‌ గా ఎంపిక అయ్యింది. వచ్చే ఏడాది పట్టాలెక్కబోతున్న క్రిష్‌ 4 సినిమా కోసం ఒక హీరోయిన్‌ గా కృతి సనన్‌ ను ఎంపిక చేయడం జరిగింది. అయితే ఆమె ఇతర ప్రాజెక్ట్‌ లు ఉన్నాయంటూ తప్పుకోవడంతో ఆ స్థానంలో కియారా అద్వానీని ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. తెలుగులో కిరాయా అద్వానీ 'భరత్‌ అనే నేను' మరియు 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే.