Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో అక్టోబర్ ఆశలు ... ?
By: Tupaki Desk | 2 Oct 2021 3:03 PM ISTటాలీవుడ్ ఇపుడు మంచి సీజన్ వైపు చూస్తోంది. తెలుగు చిత్ర సీమకు ఉండే మూడు సీజన్లలో దసరా మూడవది. నిజానికి కరోనా తరువాత అన్ని సీజన్లూ అస్తవ్యస్థం అయ్యాయి. నిఖ్సార్సుగా చెప్పుకోవాలి అంటే 2020 సంక్రాంతి తరువాత టాలీవుడ్ కి కొత్త కాంతులు లేవు. 2021 సంక్రాంతికి కాస్తా సర్దుకున్నామనిపించినా కూడా రెండవ విడత కరోనాతో సమ్మర్ మొత్తం దిగమింగేసింది. ఇక ఈ ఏడాదికి ఉన్న ఒకే ఒక్క ఆశ దసరా. అయితే ఈసారి దసరాకు పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడం ఒక రకంగా లోటు అయినా మరో వైపు చూస్తే చిన్న సినిమాలకు ఊపిరిగా ఉంది. ఏపీలో టికెట్ల వ్యవహారం ఎటూ తెమలకపోవడంతో బడా హీరోల సినిమాలు వెనక్కి తగ్గాయి. దాంతో ఇపుడు దసరా చిన్న సినిమాలకే వేదికగా మారుతోంది.
ఇవన్నీ ఇలా ఉంటే ఈసారి దసరా కొందరు హీరోల జాతకాన్ని మార్చాల్సి ఉంది. అక్కినేని వంశంలో మూడత తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కి ఈ రోజు దాకా హిట్ అన్నది లేదు. అయితే ఈసారి మాత్రం అఖిల్ మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ మూవీతో అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ ని తొలిసారిగా అందుకుంటారు అంటున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్ టూ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మించడం ప్లస్ పాయింట్ గా ఉంది. అంటే మంచి బ్యానర్ తో వస్తున్న మూవీ. ఇక పూజా హెగ్డే గ్లామర్ మరో ఆకర్షణ. అంతే కాదు ఈ మూవీ మ్యూజిక్ కూడా హిట్ అయింది. దాంతో అంచనాలు బాగా ఉన్నాయి. దీంతో అఖిల్ కి ఈ అక్టోబర్ మంచి హిట్ ఇస్తుంది అని నమ్ముతున్నారు.
ఇదిలా ఉంటే ఇదే దసరాకు మహా సముద్రం పేరుతో శర్వానంద్ వస్తున్నాడు. చాలాకాలంగా శర్వానంద్ కి హిట్ లేదు. దాంతో ఆయన కూడా దసరానే నమ్ముకున్నాడు. ఈసారి గ్యారంటీ సక్సెస్ అని కూడా ధీమాతో ఉన్నాడట. మరో వైపు చూస్తే ఫస్ట్ మూవీ ఉప్పెనతో హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఈసారి కొండపొలంతో వస్తున్నాడు. ద్వితీయ విఘ్నం లేకుండా హిట్ వస్తుందని వైష్ణవ్ కూడా నమ్మకంగా ఉన్నాడని టాక్. అశ్వద్ధామ మంచి మూవీ అని పేరు తెచ్చుకున్నా నాగ శౌర్యకు హిట్ ఇవ్వలేదు. దాంతో వరుడు కావలెను మూవీ తో మళ్లీ హిట్ ట్రాక్ లోకి రావాలని ఈ యువ హీరో చూస్తున్నాడు. సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ కి పెళ్ళి సందడితో ఫస్ట్ హిట్ దక్కుతుందని ఆశతో ఉన్నరు. ఇదే విధంగా మరికొన్ని చిన్న సినిమాలు ఈ అక్టోబర్ లో సందడి చేయనున్నాయి. మరి అక్టోబర్ ఎందరి ఆశలు తీరుస్తుందో చూడాలి. అసలే వేయి స్లంపులతో ఉన్న టాలీవుడ్ కి సక్సెస్ టానిక్ ఇస్తుందా అని కూడా అంతా ఎదురుచూస్తున్నారు.