Begin typing your search above and press return to search.

వీడియో: మిస‌మిస‌ల జూ.కాజోల్ వ‌డ్డ‌న‌లు

By:  Tupaki Desk   |   26 Dec 2022 12:25 PM GMT
వీడియో: మిస‌మిస‌ల జూ.కాజోల్ వ‌డ్డ‌న‌లు
X
ముంబై సెల‌బ్రిటీ లైఫ్ స్టైల్.. ఈవెంట్లలో త‌ళుకుబెళుకుల‌ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాలీవుడ్ స్టార్ల‌ను నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో అనుస‌రించే వారికి స్టార్ స్ట‌డెడ్ కల్చ‌ర్ ఎలా ఉంటుందో ఇప్ప‌టికే తెలుసు. బ‌ర్త్ డే పార్టీలు.. బీచ్ పార్టీలు.. వెడ్డింగ్ వేడుక‌లు అంటూ సంద‌డే సంద‌డిగా సెల‌బ్రిటీ ఈవెంట్ల‌కు కొద‌వేమీ ఉండ‌దు.

ఈవెంట్ల‌లో అంద‌గ‌త్తెల స‌య్యాట‌లు క్యాట్ వాక్ ల‌ను ప్ర‌జ‌లు ఎగ‌బ‌డి చూస్తుంటారు. తాజాగా స్టార్ హీరో అజయ్ దేవగన్ కుమార్తె నైసా దేవ‌గ‌న్ పార్టీ క్రౌడ్ లో కలకలం రేపింది. మిడిసిప‌డే మిస‌మిస అందాల‌తో మ‌తులు చెడ‌గొట్టింది. టైట్ ఫిట్ పింక్ ఫ్రాక్ లో నైసా రూప‌లావ‌ణ్యం యువ‌త‌రం గుండెల్లో బాణాలు గుచ్చింది. ఈ డిజైన‌ర్ లుక్ లో ఇన్న‌ర్ అందాల‌ను సైతం ఎలివేట్ అయ్యేలా సృజ‌నాత్మ‌క భంగిమ‌ల‌తో నైసా మైండ్ బ్లాక్ చేసింది.

ఓవైపు పార్టీలో కెమెరా క‌ళ్ల‌న్నీ నైసా పైనే. కెమెరామెన్లు నైసా దేవ‌గ‌న్ వెంట ప‌డి మ‌రీ ఫ్లాష్ లు మెరిపించారు. అయితే త‌న‌ను ఫ్లాష్ ల మెరుపుల నుంచి కాపాడేందుకు బోయ్ ఫ్రెండ్ అవ్ర‌త‌మ‌ణి చాలా పాట్లు ప‌డాల్సి వ‌చ్చింది.

ఈ వీడియో చూడ‌గానే స్టార్ డాట‌ర్ నైసా నైసుగా క‌నిపించిందంటూ యూత్ మైమ‌రిచిపోతున్నారు. అంత‌గా నైసా దివ్య‌మైన‌ రూపం క‌ట్టి ప‌డేస్తోంది. ఇటీవ‌ల‌ లండన్ పార్టీలో బోయ్ ఫ్రెండ్ ఓర్హాన్ తో ఫుల్ చిల్లింగ్ గా సెల‌బ్రేట్ చేసిన ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు మ‌రోసారి పార్టీ క్రౌడ్ నుంచి ఈ ఇద్ద‌రూ క‌లిసి ఉన్న వీడియో వెబ్ లో హీట్ పెంచుతోంది. గత రెండు నెలలుగా నైసా తన పార్టీ నుంచి వ‌రుస‌గా ఫోటోలు వీడియోల‌ను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తోంది. ఇటీవ‌ల త‌న స్నేహితులైన‌ సునీల్ శెట్టి కుమారుడు అహన్ .. అర్జున్ రాంపాల్ కుమార్తె మహికాతో బ్లాస్ట్ అయ్యే రేంజులో నైసా పార్టీ నుంచి ఫోటోలు షేర్ చేసింది. బోయ్ ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రమణి 27వ పుట్టినరోజు వేడుకలోను నైసా బ్లాస్ట్ మోడ్ లో క‌నిపించింది. తాజా పార్టీలోను ఓర్హాన్ ని విడిచి ఉండ‌లేక‌పోయింది ఈ

ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌!

బాలీవుడ్ లో స్టార్ డాట‌ర్స్ వ‌రుస‌గా బ‌రిలో దిగుతున్నారు. శ్రీ‌దేవి చిన్న కుమార్తె ఖుషీ క‌పూర్.. కింగ్ ఖాన్ షారూక్ కుమార్తె సుహానా ఖాన్.. నిర్మాత సంజ‌య్ క‌పూర్ కుమార్తె స‌నాయ ఇప్ప‌టికే క‌థానాయిక‌లుగా ఆరంగేట్రం చేస్తున్నారు. అలాగే దేవ‌గ‌న్ - కాజోల్ జంట కుమార్తె నైసా కూడా క‌థానాయిక అవుతుందా? అన్న‌దానికి ఇంకా స‌మాధానం లేదు. కానీ నైసా వైబ్స్ చూస్తుంటే రంగుల ప్ర‌పంచంలో ప్ర‌వేశించ‌డం ఖాయ‌మ‌న్న న‌మ్మ‌కం పెరుగుతోందంటూ అభిమానులు భావిస్తున్నారు. నైసా మామ్ కాజోల్ బాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌గా ఒక వెలుగు వెలిగింది. త‌న తండ్రి గారు అజ‌య్ దేవ‌గ‌న్ స్టార్ హీరోగా బాలీవుడ్ ని ఏల్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తో సౌత్ లోను అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. నైసా తెరంగేట్రానికి స‌మ‌య‌మాస‌న్న‌మైందని తాజా వైబ్స్ చెబుతున్నాయి. ఫ్యాన్స్ లో ఈ స్టార్ కిడ్ పై బోలెడన్ని అంచ‌నాలున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.