Begin typing your search above and press return to search.

ఆ సీన్‌ తరువాత ఆల్కహాల్‌ కొట్టిందట

By:  Tupaki Desk   |   11 May 2016 5:02 AM GMT
ఆ సీన్‌ తరువాత ఆల్కహాల్‌ కొట్టిందట
X
నైరా బెనర్జీ.. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ పేరు ఓ సంచనలం అయిపోతోంది. సన్నీ సినిమాలో తనూ ఒక హీరోయిన్ గా నటించిన నైరా.. టాలీవుడ్ కు బాగా తెలిసిన పిల్లే. ఇక్కడ మధురిమగా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేసిన ఈ భామ.. పేరు మార్చేసుకుని బాలీవుడ్ వెళ్లిపోయింది. అయితే.. తనకు నైరా పేరే నచ్చిందని, మధురిమకు దూరంగా ఉంటానని అంటోంది ఈ వయ్యారి.

'ఇండస్ట్రీలో మధురిమ అనే పేరుతో మరో యాక్ట్రెస్ ఉండడంతో.. గతంలో నా ఇంటర్వ్యూలు తీసుకుని మధురిమ ఫోటోలు వేశారు. అప్పుడు బాగా హర్ట్ అయ్యాను. మధురిమ అనేది నా అసలు పేరు - నైరా ముద్దు పేరు.. అయినా సరే ఇకపై అందరూ నన్ను నైరాగానే గుర్తించాలని కోరుకుంటున్నా. అసలు మధురిమ అన్న పేరుతో ఇకపై ఎలాంటి సంబంధాలు ఉండకూడదని అనుకుంటున్నా' అని చెప్పిందంటే.. నైరా ఎంతగా హర్ట్ అయిందో అర్ధమవుతుంది.

తెలుగు - తమిళ్ - కన్నడ సినిమాల్లో సాధారణమైన అమ్మాయి పాత్రలనే చేసిన నైరా.. బాలీవుడ్ లో మాత్రం అడల్ట్ కంటెంట్ మూవీతో అరంగేట్రం చేస్తోంది. మొదట ఇది కొంత ఇబ్బందిగానే అనిపించిందట. ముఖ్యంగా బెడ్ రూమ్ సీన్స్ చేసేటపుడు బాగా ఫీలయిందట. అయితే.. ఓ గ్లాస్ ఆల్కహాల్ తాగితే ఈ ఫీలింగ్ నుంచి బయటపడొచ్చని యూనిట్ వర్గాలు చెప్పడంతో.. అలా యాక్ట్ చేసేసిందట. రాత్రంతా షూటింగ్ చేశాక.. తెల్లారి ఇంటికెళ్లినపుడు.. ఆల్కహాల్ వాసన చూసి అమ్మ కొడుతుందేమో అని భయపడ్డట్లు చెబుతోంది నైరా.