Begin typing your search above and press return to search.

మహేష్‌ దెబ్బకి చరణ్‌ ఆయింట్మెంట్??

By:  Tupaki Desk   |   2 Nov 2017 9:43 PM IST
మహేష్‌ దెబ్బకి చరణ్‌ ఆయింట్మెంట్??
X
పైకి ఏ లెక్కలు ఎలా ఉన్నా కూడా.. మహేష్‌ బాబు సినిమా 'స్పైడర్' ఫ్లాప్ కావడంతో.. నిర్మాతల్లో ఒకరైన తిరుపతి ప్రసాద్ (ఎన్.వి.ప్రసాద్) కు మాత్రం గట్టిగానే నష్టాలు వాట్టిల్లినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ మద్యన పెద్ద సినిమాలు ఆడకపోతే.. తమ డబ్బుల్లో కాస్త తిరిగిచ్చేయమంటూ.. నిర్మాతలపై పంపిణీదారులు ప్రెజర్ చేస్తున్నారు. అలా ప్రెజర్ ఫీలవుతున్న సమయంలో.. ఇప్పుడు ప్రసాద్ వారందరికీ ఒక వాగ్ధానం చేసినట్లు తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీకి ఎంతో క్లోజ్ అయిన ప్రసాద్.. రామ్ చరణ్‌ తో గతంలో 'రచ్చ' 'ధృవ' సినిమాలకు కో-నిర్మాతగా ఉన్నారు. ఆ సినిమాలు చేశారనే కృతజ్ఞతా భావంతో.. ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్న ఈయనకు చరణ్‌ డేట్లు ఇచ్చాడట. దానితో అటు స్పైడర్ నష్టాలను పూడ్చమంటున్న పంపిణీదారులకు ఇప్పుడు చరణ్‌ తో చేసే సినిమాను తక్కువ రేట్లకే ఇస్తానని చెప్పడంతో వారు కూడా ఊపిరి పీల్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం మైత్రి మూవీస్ కి రంగస్థలం సినిమాను చేస్తున్న చరణ్‌.. ఆ తరువాత డివివి దానయ్య ప్రొడక్షన్లో బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత మరి ప్రసాద్ ప్రొడక్షన్లో ఒకవేళ కొరటాల శివ సినిమా ఏమన్నా చేస్తాడేమో చూడాలి.