Begin typing your search above and press return to search.

ఎవర్‌ గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ కు 20 వసంతాలు

By:  Tupaki Desk   |   6 Sept 2021 8:46 AM IST
ఎవర్‌ గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ కు 20 వసంతాలు
X
వెంకటేష్‌ సినీ కెరీర్‌ లో ఎన్నో సూపర్‌ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలు చేసిన విషయం తెల్సిందే. స్టార్‌ ఇమేజ్ పక్కన పెట్టి ఆయన చేసిన సినిమాలు ఫ్యామిలీస్ కు ఆయన్ను మరింత దగ్గర చేశాయి అనడంలో సందేహం లేదు. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ పండించిన సినిమాలు ఆయన నటించగా సూపర్‌ హిట్ అయ్యాయి. అందులో ప్రధానమైన సినిమా అంటే ఇప్పటికి ఎప్పటికి ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే మూవీ నువ్వు నాకు నచ్చావ్‌. ఈ సినిమా కు కే విజయ భాస్కర్‌ దర్శకత్వం వహించగా మాటలు మరియు స్క్రీన్‌ ప్లేను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ అందించారు. సినిమాలోని డైలాగ్స్ కామెడీ పంచ్ లు ఇంకా ఎమోషనల్ సన్నివేశాల్లో ఉండే డైలాగ్స్ ఇలా అన్ని కూడా ప్రేక్షకులను నవ్వింపజేస్తాయి.. ఆలోపింపజేస్తాయి.. ఏడ్చేలా చేస్తాయి అనడంలో సందేహం లేదు.

ఎవర్ గ్రీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ సినిమాల జాబితాలో ఈ సినిమా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమా లో హీరోయిన్‌ గా ఆర్తీ అగర్వాల్‌ నటించింది. తెలుగు లో ఆమెకు ఎంట్రీ మూవీ అయినా కూడా చక్కని నటనతో మెప్పించింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడంతో పాటు ఎమోషనల్ సీన్స్ లో వెంకటేష్ ను బ్యాలన్స్ చేస్తూ నటించి మెప్పించింది. సినిమాలో ప్రకాష్‌ రాజ్‌ పాత్ర సీరియస్ గా ఉంటూనే నవ్విస్తుంది. ఎమ్మెస్‌ నారాయణ ఇంకా పృథ్వీ ఇలా ఎంతో మంది సినిమాలో మర్చిపోలేని పాత్రల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా సునీల్‌ మరియు బ్రహ్మానందంల కామెడీ సన్నివేశాలు ఎప్పటికి మర్చిపోలేనివి. బ్రహ్మానందం ఎగ్జిబీషన్‌ లో జాయింట్‌వీల్‌ ఎక్కిన సమయంలో అరిచే అరుపులు.. కారు ఆగిపోయిన సమయంలో చేసే పని ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండి పోతుంది అనడంలో సందేహం లేదు.

సినిమా విడుదల అయ్యి సరిగ్గా 20 ఏళ్లు అవుతుంది. ఇప్పటికి కూడా నువ్వు నాకు నచ్చావ్‌ సినిమా టీవీలో వస్తుంది అంటూ చాలా మంది అతుక్కు పోయి చూసే వారు ఉన్నారు. ఇక ప్రతి పెళ్లిలో కూడా ఆకాశం దిగి వచ్చి పాట ప్లే చేస్తూనే ఉంటారు. సుహాసిని తరహా ఆడపడుచులు పదే పదే సినిమాను చూస్తూ తమ తల్లి వారి కుటుంబంను తల్చుకుంటూ ఉంటారు.

సినిమాలోని ప్రతి పాత్ర.. ప్రతి సన్నివేశం ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అయ్యేలా నవ్వించేలా ఉంటుంది అనడంలో సందేహం లేదు. స్నేహం.. ప్రేమ.. కుటుంబం.. హాస్యం.. డబ్బు ఇలా అన్ని విషయాలను ఈ సినిమాలో సమ పాళ్లలో చూపించారు. స్రవంతి రవి కిషోర్‌ నిర్మించిన ఈ సినిమా ది బెస్ట్‌ తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా విడుదలై 20 ఏళ్లు అయినా కూడా ఎలా అయితే మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామో మరో 20 ఏళ్లు అయినా కూడా ఇదే విధంగా సినిమా గురించి మాట్లాడుకుంటాం అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నువ్వు నాకు నచ్చావ్‌ అలాంటి సినిమా.