Begin typing your search above and press return to search.

'నువ్వలా' వీడియో: 'డీజే టిల్లు' లో హీరో పాడిన బ్యూటిఫుల్ మెలోడీ..!

By:  Tupaki Desk   |   7 Feb 2022 12:23 PM GMT
నువ్వలా వీడియో: డీజే టిల్లు లో హీరో పాడిన బ్యూటిఫుల్ మెలోడీ..!
X
సిద్ధు జొన్నలగడ్డ - నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ''డీజే టిల్లు''. 'అట్లుంటది మనతోని' అనే ట్యాగ్ లైన్ తో వస్తోన్న ఈ సినిమాని ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నారు. యూత్‌ ని ఆకట్టుకునే టీజర్‌ - ట్రైలర్ మరియు పాటలు ఈ సినిమాపై మంచి బజ్‌ ని క్రియట్ చేశాయి. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'నువ్వలా' అనే వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.

'నీ కనులను చూసానే.. ఓ నిమిషం లోకం మరిచానే.. నా కలలో నిలిచావే.. నా మనసుకు శ్వాసై పోయావే.. నీ పరిచయమే ప్రేమే పోయే..' అంటూ సాగిన ఈ మెలోడీ శ్రోతలను ఆకట్టుకుంటోంది. హీరోయిన్ ప్రేమలో మునిగితేలిన డీజే టిల్లు.. ఆమెతో గడిపిన క్షణాలను జ్ఞాపకాలను ఈ పాటలో నెమరు వేసుకుంటున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ గీతానికి అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేసారు.

'డీజే టిల్లు' చిత్రానికి కథ - స్క్రీన్‌ ప్లే - డైలాగ్స్ రాసిన హీరో సిద్ధు జొన్నలగడ్డ.. 'నువ్వలా' పాటను స్వయంగా ఆలపించడం విశేషం. 'క్షణం' దర్శకుడు రవికాంత్ పేరపు ఈ గీతానికి సాహిత్యం అందించడం గమనార్హం. మొత్తం మీద డీజే టిల్లు టైటిల్ సాంగ్ - 'పటాస్ పిల్లా' పాటల మాదిరిగానే తాజాగా వచ్చిన మెలోడీ కూడా ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచించి.

''డీజే టిల్లు'' సినిమాతో విమల్ కృష్ణ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.

లవ్ - ఫన్ అంశాలతో యూత్ ఫుల్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ గా ''డీజే టిల్లు' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ విలక్షణమైన పక్కా హైదరాబాదీ కుర్రాడిగా సందడి చేయనున్నారు. ప్రిన్స్ సిసిల్ - బ్రహ్మాజీ - ప్రగతి - నర్రా శ్రీనివాస్ - కిరీటి ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించారు. వాలెంటైన్స్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.