Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఎవరంటే..?

By:  Tupaki Desk   |   30 July 2018 3:51 AM GMT
బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఎవరంటే..?
X
ఏమైనా జరగొచ్చంటూ మొదట్నించి ఊరిస్తూ వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2లో అనుకోనిదే జరిగింది. అదే సమయంలో.. సోషల్ మీడియాలో ఎవైతే అంచనాలు వ్యక్తమయ్యాయో.. తూచా తప్పకుండా నిజం కావటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. ప్రతి వారాంతంలో హౌస్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేషన్ కావటం తెలిసిందే. ఈ వారం అందుకు భిన్నంగా.. ఎవరినీ ఎలిమినేట్ చేయకుండా.. ఇప్పటికే హౌస్ నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు బిగ్ బాస్.

ఇందుకు సంబంధించి గడిచిన వారం రోజులుగా ప్రేఓకుల్ని ఓట్లు వేయాలని కోరటం తెలిసిందే. ఇప్పటికే ఎలిమినేట్ అయిన హౌస్ సభ్యుల్లో ఎవరిని మళ్లీ హౌస్ లోకి పంపాలన్న అంశంపై ఓటింగ్ కు భారీగా స్పందన వచ్చినట్లుగా వెల్లడించారు నాని. రీఎంట్రీ ఇవ్వాలంటూ మొత్తం 11.79కోట్ల చిల్లర ఓట్లు తమకు వచ్చినట్లుగా నాని ప్రకటించారు.

ఇక.. హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే అంశంపై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి తగ్గట్లే అన్యాయంగా హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారంటూ బిగ్ బాస్ మీద విమర్శలు వెల్లువెత్తేలా చేసిన శ్యామలను రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో.. రెండో వారాల అనంతరం హౌస్ నుంచి ఎలిమినేట్ కావటమే కాదు.. సామాన్యుడన్న చులకనతో సింఫుల్ గా తీసి పారేశారంటూ బోలెడంత సానుభూతిని మూటకట్టుకున్న నూతన్ నాయుడ్ని మళ్లీ హౌస్ లోకి పంపనున్నట్లు ప్రకటించారు.

ఆసక్తికరమైన విషయం ఎమిటంటే.. ఈ ఇద్దరూ బిగ్ బాస్ లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే.. హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చేది ఒక్కరేనన్న ప్రచారం జరిగింది. అయితే.. ఆ అంచనాలకు భిన్నంగా ఇద్దరిని హౌస్ లోకి పంపించనున్నట్లు నాని ప్రకటించారు. ప్రేక్షకులు ఓట్లు అయితే వేశారు కానీ.. వారిని హౌస్ లోకి ఎప్పుడు పంపాలన్న అంశంపై నిర్ణయాన్ని బిగ్ బాస్ తీసుకుంటారని ప్రకటించారు నాని. ఎప్పుడు ఏమైనా జరగొచ్చంటూ మొదట్నించి చెబుతున్నట్లే.. ఇద్దరు హౌస్ మేట్స్ ను రీఎంట్రీ ఇవ్వాలన్న అంశం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.