Begin typing your search above and press return to search.

బిడ్డకు తండ్రి ఎవరో చెప్పని ప్రముఖ నటి

By:  Tupaki Desk   |   10 Sept 2021 1:55 PM IST
బిడ్డకు తండ్రి ఎవరో చెప్పని ప్రముఖ నటి
X
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ , ప్రముఖ నటి నుస్రత్ జహాన్ అంటే తెలియని వారుండరు. ఆమె అప్పట్లో ఒక ప్రముఖ వ్యాపారిని విదేశాల్లో పెళ్లి చేసుకొని ఇండియా చెల్లదని విడిపోయింది. ఈ వ్యవహారం పార్లమెంట్ లోనూ ప్రతిధ్వనించింది.

అయితే గత నెలాఖరులో నుస్రత్ మగబిడ్డకు జన్మనిచ్చింది.తల్లైన తర్వాత మొదటిసారి ఆమె కోల్ కతాలోని సెలూన్ ప్రారంభానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమెను మీడియా చుట్టుముట్టింది. మీ బిడ్డకు తండ్రి ఎవరని జర్నలిస్టు ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై ఆమె అసహనం , ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిడ్డకు తండ్రెవరో చెప్పాలని మీడియా నిలదీయడం తన వ్యక్తిత్వాన్ని కించపరచడమేనని నుస్రత్ జహాన్ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ప్రశ్నకు సమాధానం ఆ తండ్రికే తెలుసు అని నుస్రత్ బదులిచ్చారు.

తన కుమారుడి పేరు ‘ఇషాన్’ అని నుస్రత్ బదులిచ్చారు. తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పడానికి మాత్రం నుస్రత్ ఇష్టపడేలుద.

2019లో ప్రము టర్కీ వ్యాపారవేత్త నిఖిల్ జైన్ ను టర్కిష్ చట్టం ప్రకారం నుస్రత్ వివాహం చేసుకున్నారు.ఇటీవల భర్తతో తెగదెంపులు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులతో ఉంటున్నారు.