Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః పెళ్లి కూతురు కూడా ఇంత హాట్ గా ఉంటారా?

By:  Tupaki Desk   |   10 March 2021 6:30 AM GMT
ఫొటోటాక్‌ః పెళ్లి కూతురు కూడా ఇంత హాట్ గా ఉంటారా?
X
ప్రముఖ వెడ్డింగ్ మ్యాగజైన్‌ 'ఖుష్‌ వెడ్డింగ్‌' కవర్‌ ఫొటో మరోసారి అదిరి పోయింది. స్టార్‌ ముద్దుగుమ్మలకు పెళ్లి కూతురు గెటప్ వేసి ఫొటో షూట్‌ లు చేసి కవర్ వేస్తున్న ఖుష్‌ వారు ఈసారి హీరోయిన్‌ కమ్‌ బుల్లి తెర స్టార్‌ నుష్రత్ భారుచ ను కవర్‌ పై దించేశారు. పెళ్లి కూతురుగా నుష్రత్ భారుచ చాలా బాగా వచ్చింది. నిజంగా పెళ్లికి సిద్దం అయ్యిందా అన్నట్లుగా ఈ అమ్మడిని ఫొటో గ్రాఫర్‌ చూపించాడు. పెళ్లి కూతురుగా రెడీ అయిన నుష్రత్ భారుచ అందాలను ఏమాత్రం దాచుకోలేదు అన్నట్లుగా నడుము అందం చూపించడంతో పాటు క్లీ వేజ్‌ షో చేసింది. పెళ్లి కూతురు కాస్ట్యూమ్స్ లో ఈ రేంజ్ అందాల ప్రదర్శణ చూడటం అరుదు. నుష్రత్ భారుచ ఖుష్‌ మ్యాగజైన్‌ కోసం ఆ క్రెడిట్ దక్కించుకుంది.

సోషల్‌ మీడియాలో నుష్రత్ భారుచ లుక్‌ పై నెటిజన్స్‌ ప్రశంసలు కురిపించారు. స్టన్నింగ్ లుక్‌ తో అద్బుతమైన ఫిజిక్‌ తో ఆకట్టుకునేలా ఉందంటున్నారు. ఈ అమ్మడు దాదాపు పదేళ్ల క్రితం తెలుగులో తాజ్ మహల్ అనే సినిమా చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడక పోవడంతో మళ్లీ ఇటు వైపు రాలేదు. అయితే హిందీ మరియు తమిళంలో నటించడంతో పాటు బుల్లి తెరపై ఓటీటీ ప్లాట్ పామ్‌ పై ఈ అమ్మడి సందడి కంటిన్యూ అవుతోంది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్న ఈ సమయంలో ఈమె జోరు మొదలు అయినట్లుగా అనిపిస్తుంది. ఈ ఫొటో షూట్‌ తో ఈమె జోరు మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు.