Begin typing your search above and press return to search.

మళ్లీ బుక్కయిన అమ్మ రాజశేఖర్

By:  Tupaki Desk   |   9 Oct 2015 11:30 AM
మళ్లీ బుక్కయిన అమ్మ రాజశేఖర్
X
కొరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ మరో కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. రాజశేఖర్, అతడి మనుషులు తనపై దాడి చేసినట్లు వెంకట్ రెడ్డి అనే జిమ్ ట్రైనర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అమ్మ రాజశేఖర్ అండ్ గ్యాంగ్ తనను అకారణంగా కొట్టి, దూషించారని వెంకట్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం అసలేం జరిగిందంటే..

యూసుఫ్ గూడకు దగ్గర్లోని ఎల్లారెడ్డి గూడలో అమ్మ రాజశేఖర్ ఉండే అపార్ట్ మెంట్లోనే వెంకట్ రెడ్డి ఉంటున్నాడు. ఐతే రాజశేఖర్ ఫ్లాట్ నుంచి తరచుగా భారీ సౌండుతో పాటలు వినిపిస్తుండటంతో ఇలా చేయొద్దని హెచ్చరించడానికి వెంకట్ రెడ్డి అతడి ఆఫీసుకి వెళ్లాడు. అక్కడ రాజశేఖర్ లేకపోతే అతడి డ్రైవర్ కు విషయం చెప్పాడట. ఇకపై ఇలా చేయొద్దని హెచ్చరించి వచ్చాడు.

ఐతే ఆ తర్వాత విషయం తెలుసుకున్న రాజశేఖర్.. వెంకట్ రెడ్డి కోసం అతడి స్నేహితుడి దగ్గర ఆరా తీశాడు. వెంకట్ ఫ్రెండ్ మొబైల్ లాక్కుని అతనొచ్చేవరకు ఇవ్వనన్నాడు. తీరా వెంకట్ వెళ్లాక తన మనుషులతో కలిసి అతణ్ని కొట్టి, తిట్టి పంపించాడు. దీంతో తాను పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చిందని వెంకట్ అంటున్నాడు. అమ్మ రాజశేఖర్ ఇంతకుముందోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడటంతో పాటు వేరే వివాదాలతోనూ వార్తల్లో నిలిచాడు