Begin typing your search above and press return to search.
నా పాపకు ఇంకా పాలిస్తూనే ఉన్నా
By: Tupaki Desk | 12 Feb 2020 11:45 AM ISTతెలుగులో పలు చిత్రాల్లో నటించి హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ సమీరా రెడ్డి. ఈ అమ్మడు బాలీవుడ్ కు వెళ్లి పోయి అక్కడ హీరోయిన్ గా కొంత కాలం కొనసాగి ఆ తర్వాత వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాంటూ సోషల్ మీడియాలో చెబుతూ వస్తున్న సమీరా రెడ్డి అప్పుడప్పుడు పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... తల్లి కాబోతున్న వారు ఎలా ఉండాలి అనే విషయాలపై అవగాహణ కలిగించేలా పోస్ట్ లు పెడుతూ ఉంటుంది.
తాజాగా పిల్లలకు తల్లి పాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఒక పోస్ట్ ను పెట్టింది. తన కూతురు నైరా ప్రస్తుతం ఏడవ నెలలో ఉందని.. ప్రస్తుతం ఆమెకు లైట్ ఫుడ్ ను అందిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ముంగ్దాల్ తో కూడిన పదార్థాలను నైరాకు పెడుతున్నట్లుగా సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన సమీరా ఆ ఆహారం మేకింగ్ కూడా తెలియజేసింది. తన కూతురు నైరా ఆ ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ తినడంను కూడా సమీరా రెడ్డి వీడియో గా పోస్ట్ చేసింది.
గత ఆరు వారాలుగా తాను నైరాకు ఫుడ్ ఇవ్వడం మొదలు పెట్టాను అంటూ చెప్పిన సమీరా రెడ్డి తల్లి పాలను కంటిన్యూ చేస్తున్నట్లుగా చెప్పింది. నేను ఇంకా నైరాకు పాలు ఇస్తున్నాను. ఎందుకంటే తల్లి పాలు అనేవి పిల్లలకు చాలా అవసరం. వారిలో రోగ నిరోదక శక్తిని పెంపొందించడంలో తల్లి పాలు చాలా కీలకంగా పని చేస్తాయి. అందుకే నేను ఇంకా నా పాపకు బ్రెస్ట్ ఫీడిరగ్ చేస్తున్నట్లుగా సమీరా చెప్పుకొచ్చింది. సెలబ్రెటీలు పిల్లలకు బ్రెస్ట్ ఫీడిరగ్ ఇవ్వరేమో అని కొందరు అనుకుంటారు. కాని సమీరా మాత్రం తాను బ్రెస్ట్ ఫీడిరగ్ ను తన పాపకు ఇస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చింది.