Begin typing your search above and press return to search.
#NTR30 హోరు జాతీయ అవార్డుల జోరులో..!
By: Tupaki Desk | 23 March 2021 8:00 PM ISTఅవార్డులు ఎంతటి ఉత్సాహం పెంచుతాయో ఎంత గొప్ప ప్రోత్సాహకంగా ఉంటాయో చెప్పేందుకు ఇదే ఎగ్జాంపుల్. నిన్నటిరోజున జెర్సీ (2019) చిత్రానికి రెండు విభాగాల్లో అవార్డులు గెలుచుకుందని ప్రకటించగానే సితార - హారిక సంస్థల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ 30 కి సంబంధించిన అప్ డేట్ ని ఎంతో ఉత్సాహంగా మీడియాతో పంచుకున్నారు నిర్మాత నాగవంశీ. అరవింద సమేత తర్వాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో తారక్ మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమా ఎప్పుడు మొదలవుతుందా? అని అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తుండగానే అవార్డుల ప్రకటన వెలువడింది.
జెర్సీ రెండు జాతీయ అవార్డులను గెలుచుకున్నందున తన ఆనందాన్ని పంచుకునేందుకు నిర్మాత నాగవంశీ మీడియాతో సంభాషించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రం ఏప్రిల్ చివరి నుండి లేదా మే మొదటి వారం నుండి సెట్స్ కెళుతుందని వెల్లడించారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయని తెలిపారు.