Begin typing your search above and press return to search.

12.5 ల‌క్ష‌లు గెలుచుకున్న ఎన్టీఆర్‌

By:  Tupaki Desk   |   8 Jan 2016 10:46 AM IST
12.5 ల‌క్ష‌లు గెలుచుకున్న ఎన్టీఆర్‌
X
ఎన్టీఆర్ ఈ సంక్రాంతికి డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడు. అత‌డు న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో మూవీ ఎంతో ప్రెస్టేజియ‌స్ గా సంక్రాంతి బ‌రిలో దిగుతోంది. అయితే సేమ్ టైమ్ అత‌డి ఎపిసోడ్‌ తో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు కూడా బుల్లితెర‌పై అల‌రించ‌బోతోంది. అయితే ఈ బుల్లితెర షోలో సంథింగ్ స్పెష‌ల్ ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఈ సంక్రాంతికి ఎంఈకే వెరీ స్పెష‌ల్‌. ఎందుకంటే కింగ్ ముందు హాట్‌ స్పాట్‌ లో ఎన్టీఆర్ ద‌ర్శ‌న‌మీయ‌బోతున్నాడు. ఓ వైపు నాన్న‌కు ప్రేమ‌తో చూసి ఖుషీలో ఉన్న అభిమానుల‌కు సేమ్ డే నే ఎంఈకేలో ఎన్టీఆర్‌ ని వీక్షించే అవ‌కాశం ద‌క్కుతోంది. అంటే అటు వెండితెర‌, ఇటు బుల్లితెర రెండు చోట్లా అభిమానుల్ని అల‌రించేందుకు యంగ్ య‌మ రెడీ అవుతున్నాడ‌న్న‌మాట‌! ఇప్ప‌టికే ఎంఈకే కోసం ఎన్టీఆర్ ఎపిసోడ్ షూట్ చేసేశారు. ఈ షోలో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ వండ‌ర్‌ ఫుల్‌ గా ఉంటుందిట‌. 12 ప్ర‌శ్న‌ల వ‌ర‌కూ ఎన్టీఆర్ ఆన్స‌ర్ చేశాడు. అందుకోసం ఏకంగా 12.5 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీని ఎన్టీఆర్ అందుకున్నాడ‌ని చెబుతున్నారు. ఈ షోలో ఎన్టీఆర్ మైండ్ బ్లోవింగ్ ఆన్స‌ర్స్‌కి ఆడియెన్ స్పెల్ బౌండ్ అయిపోవాల్సిందేన‌ని చెప్పుకుంటున్నారు.

అయితే ఎన్టీఆర్ ఎంఈకేలో పార్టిసిపేట్ చేయ‌డానికి కార‌ణం డ‌బ్బు గెలుచుకోవ‌డానికి కాదు. కేవ‌లం త‌న ఐక్యూ లెవ‌ల్‌ ని చెక్ చేసుకునేందుకే. సేమ్ టైమ్ త‌న సినిమా నాన్న‌కు ప్రేమ‌తో ప్ర‌మోష‌న్ కూడా ప‌న‌వుతుంది క‌దా!