Begin typing your search above and press return to search.
బాహుబలి.. ఎన్టీఆర్ కూడా దిగాడు
By: Tupaki Desk | 9 July 2015 1:50 PM ISTబాహుబలి.. ఇది మన సినిమా అని తెలుగు ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునేలా ఉంటుందని ముందు నుంచే అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే హైప్ నెలకొందిప్పుడు. ఇండియస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ట్యాగ్‌తో 'బాహుబలి' విడుదలవుతున్న సమయంలో ఇండస్ట్రీలో అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పైరసీ విషయంలో అల్లు అరవింద్ లాంటి పెద్దలు స్వచ్ఛందంగా బాహుబలి కోసం ముందుకొచ్చారు. మరోవైపు ఇండస్ట్రీలోనే పెద్ద పెద్ద హీరోలందరూ కూడా బాహుబలి గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడుతూ.. రాజమౌళి అండ్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతుండటం.. ఆ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుండటం విశేషం.
మహేష్‌బాబు తన సినిమా 'శ్రీమంతుడు'ను వాయిదా వేసుకోవడమే కాదు.. బాహుబలి మనందరికీ గర్వకారణమని, ఆ సినిమా బాగా ఆడాలని ఆకాంక్షించారు. మరో స్టార్ హీరో రామ్‌చరణ్.. ప్రభాస్, రానా ఇలాంటి సినిమాతో ఉన్నత స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందన్నాడు. అల్లు అర్జున్ కూడా ఇదే తరహాలో ట్వీట్ చేశాడు. మన సినిమాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన రాజమౌళికి థ్యాంక్స్ కూడా చెప్పాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వంతు వచ్చింది. బాహుబలి విడుదలకు ఇంకొక్క రోజే సమయముండగా.. ట్విట్టర్లో ఈ సినిమా గురించి ట్వీట్ పెట్టాడు ఎన్టీఆర్. ''తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలి దశదిశలా వ్యాపించేలా చేస్తుందని నా నమ్మకం'' అని ఓ ట్వీట్ చేసిన ఎన్టీఆర్.. తన ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళికి, అతడి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతూ మరో ట్వీట్ చేశాడు. తన సినిమాల గురించే ఎప్పుడూ ట్వీట్లు చేయని ఎన్టీఆర్.. బాహుబలి కోసం ట్వీట్ చేయడం విశేషమే. మొత్తానికి బాహుబలి గురించి ఇండస్ట్రీ అంతా ఇలా పాజిటివ్‌గా మాట్లాడటం మంచి పరిణామమే.