Begin typing your search above and press return to search.
బన్నీ బావా.. ఏంటా పిలుపు తారక్
By: Tupaki Desk | 12 Jan 2020 7:15 PM ISTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం నేడు విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అల..కు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆమెరికాలో ప్రీమియర్ షోల నుంచి బాగా వసూలైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో బన్నీ ఈ సంక్రాంతి ని మంచి జోష్ తోనే సెలబ్రేట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా వీక్షించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బన్నీని ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ``చాలా ఇష్టంతో అద్భుతంగా నటించిన అల్లు అర్జున్ ఈజ్... త్రివిక్రమ్ గారి బ్రిలియంట్ రైటింగ్ వల్ల అల వైకుంఠపురములో చాలా గొప్ప సినిమాగా నిలిచింది. బావా...! సామీలకు కంగ్రాట్స్!!`` అంటూ ట్వీట్ చేసారు.
తన తోటి నటుల విషయంలో తారక్ ఎంత చనువుగా ఉంటాడో చెప్పాల్సిన పనిలేదు. తన ఇష్టాన్ని మాటల ద్వారా చూపిస్తుంటారు. ఆ మధ్య `భరత్ అనే నేను` ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసి మహేష్ ని అన్నా అంటూ సంబోధించిన సంగతి తెలిసిందే. మహేష్ ని ఎప్పుడూ అన్నా అని పిలుస్తానని తొలిసారి మీడియా సమక్షంలో ఓపెన్ అయి ... అభిమానులతో పంచుకున్నాడు. ఇక రామ్ చరణ్ తోనూ అంతే స్నేహంగా మెలుగుతాడు.
తాజాగా బన్నీని బావా అంటూ సంబోధించడం అభిమానుల్లో చర్చకు తావిచ్చింది. కారణాలు ఏవైనా ఇలాంటి పిలుపు పరిశ్రమలో...అభిమానుల్లో హెల్దీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి! అన్నది నిజం. అభిమానుల మధ్య వైరాన్ని తొలగించడానికి ఇలాంటి రిలేషన్ షిప్ ని మిగతా హీరోలు కూడా అనుసరించాలి. ఇప్పటికే చరణ్...మహేష్...తారక్ ఎంతో స్నేహంతో ముందుకు వెళ్లే ప్రత్నం చేస్తున్నారు. మరి తారక్ కొత్త పిలుపు విషయంలో బన్నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.