Begin typing your search above and press return to search.

తారక్ కి రెమ్యునరేషన్ వద్దట..

By:  Tupaki Desk   |   6 Nov 2017 2:19 PM IST
తారక్ కి రెమ్యునరేషన్ వద్దట..
X
కాలం చాలా స్పీడ్ గా వెళుతోంది. అయితే ఈ వేగవంతమైన రోజుల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఇతర ఇండస్ట్రీలకంటే ఈ పదేళ్లలో ఎక్కువ స్పీడ్ లో వెళుతోందని చెప్పవచ్చు. మార్కెట్ అయితేనేమి టెక్నాలజీ అయితేనేమి బాలీవుడ్ కి కంటే ఎక్కువే అభివృద్ధి చెందిందని చెప్పాలి. ఉదాహరణకు బాహుబలి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే మన హీరోలు కూడా ఇప్పుడు 100 కోట్లను ఈజీగా క్రాస్ చేస్తున్నారు. ఏ మాత్రం డౌట్ లేకుండా పెట్టిన బడ్జెట్ కంటే డబుల్ వసూళ్లను అందుకుంటున్నారు. అయితే మన స్టార్ హీరోల రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోతోంది. ఒక్కొక్కరు ఇప్పుడు 20 కోట్లను ఈజీగా క్రాస్ చేశారు. అయితే ఒక్కొసారి హీరోలు రెమ్యునరేషన్ కాకుండా ఏరియాలలో అమ్మవలసిన హక్కులను తీసేసుకొని వారే రిలీజ్ చేసుకుంటున్నారు. ఇకపోతే షేర్స్ కూడా అడుగుతున్నారట కొంతమంది. ఈ తరహా ఆలోచన ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీ హీరోలు ఫాలో అవుతున్నారు. ఇంతకుముందు చిరంజీవి - మహేష్ బాబు వారి మార్కెట్ ను చూసుకొని ఇలానే అడిగేవారు. ఇప్పుడు ఎన్టీఆర్ వంతొచ్చినట్లుంది.

ఎన్టీఆర్ కూడా తన నెక్స్ట్ సినిమా నుంచి ఇదే తరహాలో లాబాలని అందుకొనున్నాడాట. త్వరలో త్రివిక్రమ్ తో తీయబోయే సినిమా కోసం ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ని కాకుండా లాభాల్లో షేర్స్ ని ఇవ్వాలని అంటున్నాడట. రిసేంట్ గా బిగ్ బాస్ షోతో బాగా ఆకట్టుకున్న తారక్ జై లవకుశ సినిమాతో మంచి బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో రెమ్యునరేషన్ కాకుండా షేర్ అడుగుతున్నాడు అని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ జనవరిలో స్టార్ట్ కానుందని తెలిసిందే.