Begin typing your search above and press return to search.

NTR వ‌ర్సెస్ RC జంక్ష‌న్ జామ్ అయ్యేలా?

By:  Tupaki Desk   |   23 March 2021 6:00 PM IST
NTR వ‌ర్సెస్ RC జంక్ష‌న్ జామ్ అయ్యేలా?
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఎస్.ఎస్.రాజ‌మౌళి ఈ సినిమాని ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో మ‌హ‌దాద్భుతంగా నిలిచిపోయేలా గొప్ప‌ దృశ్య కావ్యంలా మ‌లుస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. అక్టోబ‌ర్ 13న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

అయితే అంత‌కు చాలా ముందే ఆర్.ఆర్.ఆర్ సంబ‌రాల్ని తారక్ - చెర్రీ అభిమానులు ప్రారంభించేస్తున్నారు. మార్చి 27న చ‌ర‌ణ్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని ఆర్.ఆర్.ఆర్ నుంచి అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ కానుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

దాంతో సంబంధం లేకుండా ఆ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేట‌ర్ లో మ‌గ‌ధీర ప్ర‌త్యేక షోని వేసేందుకు చ‌రణ్ ఫ్యాన్స్ ఏర్పాట్ల‌లో ఉన్నారు. అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జంక్ష‌న్ లో మ‌గ‌ధీరుని ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండ‌ద‌ని క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టే. ఇక‌పోతే అదే రోజు ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ చిత్రం `ఆది` 19వ విడుదల వార్షికోత్సవం సందర్భంగా తారక్ అభిమానులు కూడా హంగామా చేయ‌నున్నార‌ట‌. ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోనే సుదర్శన్ 35 ఎంఎం లో `ఆది` ప్రత్యేక షోకి ప్లాన్ చేశార‌ని తెలిసింది‌.

ఒకే రోజు రెండు భారీ ఈవెంట్ల‌తో ఎక్స్ రోడ్స్ జామ్ అయిపోతుంద‌ని అంచ‌నా. తార‌క్.. చెర్రీ అభిమానుల‌తో జంక్ష‌న్ లో హంగామా పీక్స్ కి చేరుతుందని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఇరు చిత్రాల‌కు సంబంధించిన టిక్కెట్లు అమ్ముడ‌య్యాయి. థియేటర్లలో సెల‌బ్రేష‌న్స్ ని ఘ‌నంగా జ‌రుపుకోనున్నారు.