Begin typing your search above and press return to search.
తారక్ వర్సెస్ మహేష్ .. ఇద్దరిలో ఎవరితో ముందు మాయావీ?
By: Tupaki Desk | 12 Oct 2020 10:15 AM ISTఇది చేపల వేట. వలకు చిక్కితే వదలకూడదు. ప్రస్తుతం కొందరు స్టార్ హీరోలతో దర్శకుల గేమ్ ఇలానే ఉంది. ఓవైపు #RRR కోసం జక్కన్నకు చిక్కిన తారక రామ బయటపడేదెలా? అంటూ చర్చ సాగుతోంది. ఆ మూవీ చిత్రీకరణ ముగించి బయటకు వస్తేనే త్రివిక్రమ్ తో సినిమా చేయగలడు.
కానీ ఈలోగానే సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ సినిమా అంటూ ప్రచారం సాగిపోతోంది. అంటే తారక్ ని సైడేసి త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేస్తాడా? అలా అయితే పరశురామ్ తో సినిమాని మహేష్ ముందు పూర్తి చేయడా? త్రివిక్రమ్ తో పరశురామ్ తర్వాతేనా? ఇలా రకరకాల డౌట్లు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఇప్పటికే మహేష్ ఎంతో నిర్థాక్షిణ్యంగా సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా దర్శకుల్ని వెనక్కి నెట్టేస్తున్నారు. పూరి జగన్నాథ్.. సుకుమార్.. వంశీ పైడిపల్లి ఈ ముగ్గురికి అయిన అనుభవం ఏమిటో అందరికీ తెలిసినదే.
స్క్రిప్టును పక్కాగా రెడీ చేసి స్మార్ట్ గా వేగంగా మూవీని తెరకెక్కించేవాళ్లకే మహేష్ దగ్గర అవకాశం. ఇప్పటికి పరశురామ్ కి ఆ ప్లేస్ దక్కింది. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ వేగంగా పావులు కదపడం చూస్తుంటే రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరశురామ్ మూవీ పూర్తయ్యాకే త్రివిక్రమ్ తోనా? అన్నది ఓ సందిగ్ధత వ్యక్తమవుతోంది. ఇక కరోనా లాక్ డౌన్ వల్ల పరశురామ్ మూవీ ఆలస్యమైంది. ఇది అతడికి చిక్కులు తెస్తుందా? ఎంతో సిన్సియర్ గా తన ఫేవరెట్ హీరో కోసం ఇన్నాళ్లు వెయిట్ చేశాడు కదా! అంటూ ఒకటే చర్చ ఇప్పుడు మొదలైంది. ఇకపోతే సర్కార్ వారి పాట అనే టైటిల్ ప్రకటించి లుక్ కూడా లాంచ్ చేశారు కాబట్టి ఈ ప్రాజెక్టుకు డోఖా ఏం లేదు. అయితే త్రివిక్రమ్ తో మంతనాల పై మహేష్ బృందం క్లారిటీ ఇస్తే బావుంటుందేమో? #RRR తో చిక్కుకున్న ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ వేచి ఉన్నాడా లేడా? అన్నదానికి కూడా అట్నుంచి వివరణ రావాల్సి ఉంది.