Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కనిపించడు.. వినిపిస్తాడు

By:  Tupaki Desk   |   25 Sept 2016 5:00 PM IST
ఎన్టీఆర్ కనిపించడు.. వినిపిస్తాడు
X
‘ఇజం’ నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో అత్యంత ముఖ్యమైన సినిమా. తొలిసారి అతను పూరి జగన్నాథ్ లాంటి పెద్ద దర్శకుడితో పనిచేస్తున్నాడు. తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ‘షేర్’ లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మళ్లీ తనేంటో చూపించాలి. కాబట్టి ఇది అతడికి ప్రతిష్టాత్మకమైన చిత్రం. ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా ఉంటుందని తమ్ముడు ఎన్టీఆర్ తో క్యామియో రోల్ చేయించాలని అతను భావించినట్లుగా కొన్నాళ్ల కిందట వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఐతే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ‘ఇజం’లో క్యామియో రోల్ చేయట్లేదట.

తనకు ఆఫర్ చేసిన పాత్ర ఫోర్స్డ్ గా ఉందని.. దీని వల్ల సినిమాకు అంతగా ప్రయోజనం ఉండదని చెప్పి ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదట తారక్. ఈ విషయంలో అన్నయ్యను కన్విన్స్ చేసిన ఎన్టీఆర్.. ‘ఇజం’కు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రం అంగీకరించాడట. ఇంతకుముందు ‘పటాస్’ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పాడు. ఆ సినిమా సూపర్ హిట్టయింది. దీంతో సెంటిమెంటుగా కూడా వాయిస్ ఓవర్ కలిసొస్తుందని అన్నదమ్ములిద్దరూ ఆ మేరకు ఫిక్స్ అయినట్లు సమాచారం. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ‘ఇజం’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సెప్టెంబరు 29నే విడుదల కావాల్సిన సినిమా అక్టోబరు మూడో వారంలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.