Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ విహారయాత్రలు పక్కా!!

By:  Tupaki Desk   |   18 Sept 2017 3:16 PM IST
ఎన్టీఆర్ విహారయాత్రలు పక్కా!!
X
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత కొంత కాలంగా ఎంత బిజీగా ఉన్నడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు బిగ్ బాస్ షోను చేస్తూనే.. మరో వైపు కెరీర్ లోనే భారీ ప్రాజెక్టు అయిన జై లవకుశ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇక ఆ సినిమా విడుదలకు ఎంతో సమయం లేకపోవడంతో ఎన్టీఆర్ ప్రమోషన్స్ ని కూడా బాగా నిర్వహిస్తున్నాడు. రీసెంట్ గా బిగ్ బాస్ లో కూడా తారక్ తనదైన శైలిలో జ లవకుశ టీమ్ తో ప్రమోషన్స్ ని నిర్వహించి అందరిని ఆకట్టుకున్నాడు.

అయితే ఈ రెండు పనులు అయిపోయిన తర్వాత తారక్ ఏం చేస్తాడు అనేది అందరి దృష్టిలో మెదులుతున్న ప్రశ్న. జై లవకుశ మొదలైనప్పటి నుంచి తారక్ అస్సలు గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొన్నాడు. రోజుకి లెక్కలేనన్ని కాస్ట్యూమ్స్ మార్చాడు. అయితే ఇన్ని రోజులు తీరిక లేకుండా గడిపినందుకు తారక్ ఇక కొన్ని రోజుల వరకు ఫ్యామిలీతో కలిసి యూరప్ - అమెరికా చుట్టేసి వస్తాడట. అసలైతే ఎన్టీఆర్ జై లవకుశ సినిమాషూటింగ్ మొదలు పెట్టక ముందే త్రివిక్రమ్ తో సినిమాను ఒకే చేశాడు. కానీ ప్రస్తుతం త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ 25వ చిత్రంతో చాలాబిజీగా ఉన్నాడు. ఆ చిత్రం సంక్రాంతి కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో త్రివిక్రమ్ జనవరి తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పాడట. దీంతో అప్పటివరకు తారక్ కుటుంబంతో కలిసి హాయిగా కొన్ని రోజులు గడపడానికి విహారయాత్రలకు సిద్దమయ్యాడు.

ఇదే విషయంపై స్పందించిన తారక్.. లండన్ వెళ్తున్నాడా లేక ఇతరత్రా దేశం వెళ్తున్నాడా అనేది ఇంకా స్పష్టత రాలేదు కాని.. జై లవ కుశ రిలీజ్ అయ్యాక.. ఒక అట్లాస్ పెట్టుకుని.. చిట్స్ వేసి.. ఒక దేశం ఎంచుకుని.. అక్కడికి వెళతాం అంటున్నాడు. ఇక జై లవకుశ సినిమా ఇప్పటికే రిలీజ్ కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. ఈ నెల 21న అత్యధిక థియేటర్స్ లో ఆ సినిమా విడుదల కాబోతోంది.