Begin typing your search above and press return to search.

ఎవరెవరికి డేట్స్ ఇస్తావ్ తార‌క్..!

By:  Tupaki Desk   |   30 April 2021 4:12 PM IST
ఎవరెవరికి డేట్స్ ఇస్తావ్ తార‌క్..!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా ఐదు విజయాలు అందుకుని మంచి ఫార్మ్ లో ఉన్నాడు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో తారక్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోనుంది. ఈ నేపథ్యంలో తన మార్కెట్ విస్తరించుకునే దిశగా తదుపరి సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాడు. అయితే ఎందుకో ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా విషయంలో క్లారిటీ మిస్ అయింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హాసిని అండ్ హారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తారక్. మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్తుందని అనుకుంటుండగా.. త్రివిక్ర‌మ్ సినిమా లేద‌ని క్లారిటీ ఇచ్చేసి.. కొర‌టాల శివ‌తో సినిమా చేస్తున్న‌ట్లుగా మరో క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా రూపొందనుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో డైరెక్టర్ కి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

'ఉప్పెన' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన లైన్ ఎన్టీఆర్ కి తెగ న‌చ్చేయ‌డంతో సినిమా చేయ‌డానికి అంగీక‌రించిన‌ట్లుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్. బుచ్చిబాబు ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్టును రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడని.. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ట్రిపుల్ ఆర్ త‌రువాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా మీద క్లారిటీ లేకుండా పోయింది. ఇకపోతే 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ వంటి వారు కూడా ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి స్క్రిప్టులు పట్టుకొని రెడీగా ఉన్నారు