Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ - కొరటాల క్యాన్సిల్‌.. వంశీ తోనా?

By:  Tupaki Desk   |   19 Aug 2015 9:05 AM IST
ఎన్టీఆర్‌ - కొరటాల క్యాన్సిల్‌.. వంశీ తోనా?
X
ఎన్టీఆర్‌ హీరోగా మైత్రి మూవీస్‌ సంస్థ ఓ సినమాని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీమంతుడు ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తారని ప్రచారమైంది. మైత్రి మూవీస్‌ కొరటాలతో ఇప్పటికే ఓ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది కాబట్టి మరో ఛాన్స్‌ కొరటాలకే ఉంటుందని ముచ్చటించుకున్నారు. అయితే ఇప్పుడు సీన్‌ మారిపోతోందని సమాచారం.

శ్రీమంతుడు తర్వాత కొరటాల తదుపరి ప్రాజెక్టు ఏంటి? అన్నదానిపై ఇంకా వివరాలు వెల్లడించలేదు. అంటే అతడి వద్ద ఎన్టీఆర్‌ కోసం పూర్తి కథ సిద్ధంగా లేకపోవడం వల్లే ఏ ప్రకటనా లేదని అనుకుంటున్నారు. అయితే ఈలోగానే ఎన్టీఆర్‌ హీరోగా 'బృందావనం' వంటి హిట్‌ సినిమాని ఇచ్చిన వంశీ పైడిపల్లి లండన్‌ లో ఎన్టీఆర్‌ ని కలిసి ఓ కథ చెప్పాడని, అది ఓకే అయ్యిందని చెప్పుకుంటున్నారు.

అయితే ఎన్టీఆర్‌ వంశీతోనే ముందుకు వెళతాడా? లేదూ కొరటాలకు ఆప్షన్‌ ఉందా? అన్నది అధికారికంగా అట్నుంచి ప్రకటించాకే తెలుస్తుంది. ఇద్దరు దర్శకుల్లో ఎవరు ముందుగా పావులు కదుపుతారో వాళ్లకే ఆ ఛాన్స్‌. ప్రస్తుతానికి వెయిట్‌ అండ్‌ సీ.