Begin typing your search above and press return to search.

'బింబిసార‌'పై ఎన్టీఆర్ ట్వీట్ వైర‌ల్‌!

By:  Tupaki Desk   |   5 Aug 2022 7:30 AM GMT
బింబిసార‌పై ఎన్టీఆర్ ట్వీట్ వైర‌ల్‌!
X
నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ న‌టించిన పీరియాడిక్ ఫిక్ష‌న‌ల్ మూవీ 'బింబిసార‌'. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కె. హ‌రికృష్ణ ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. 5వ శ‌తాబ్దానికి చెందిన బింబిసారుడు నేటి అధునిక వ‌ర‌ల్డ్ లోకి ఎలా వ‌చ్చాడు? .. ఎందుకు వ‌చ్చాడు? వ‌చ్చి ఏం చేశాడు? అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థా, క‌థ‌నాల‌తో ఈ మూవీని రూపొందించారు. ఫ‌స్ట్ లుక్ నుంచే అంచ‌నాలు పెంచేసిన ఈ మూవీ టీజ‌ర్, ట్రైల‌ర్ ల‌తో భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది.

ఈ ఫాంట‌సీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ద్వారా మ‌ల్లిడి వ‌శిష్ట ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. భారీ స్థాయిలో భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ మూవీ ఆగ‌స్టు 5న శుక్ర‌వారం భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ‌స్ట్ షో నుంచే మంచి టాక్ ని సొంతం చేసుకోవ‌డం, ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భించ‌డంతో చిత్ర బృందం ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో అభిమానుల సాక్షిగా సినిమా ఖ‌చ్చింత‌గా మిమ్మ‌ల్ని నిరాశ‌ప‌ర‌చ‌ద‌ని, సంతృప్తి ప‌రిచి నంద‌మూక‌రి అభిమానులు కాల‌ర్ ఎగ‌రేసే విధంగా వుంటుంద‌ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్టేట్ మెంట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

త‌ను అన్న రిజ‌ల్ట్ రావ‌డంతో ఎన్టీఆర్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. దీంతో సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎన్టీఆర్ షేర్ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

దాదాపు ఏడాదిన్న‌ర విరామం తరువాత క‌ల్యాణ్ రామ్ నుంచి వ‌చ్చిన 'బింబిసార‌' మూవీ ఆశించిన విజ‌యాన్ని రాబ‌ట్ట‌డంతో ఎన్టీఆర్ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. 'బింబిసార‌' గురించి గొప్ప విష‌యాలు వింటున్నాను.

మొద‌టిసారి చూస్తున్న‌ప్పుడు మ‌నం అనుభ‌వించిన ఉత్సాహంతో ప్ర‌జ‌లు సినిమాను ఆస్తాదించిన‌ప్పుడు మంచి అనుభూతి క‌లుగుతుంది. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ అన్నా నువ్వు త‌ప్ప‌ బింబిసార రాజు పాత్ర‌ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు. ద‌ర్శ‌కుడు వ‌శిష్ట చాలా అద్భుతంగా ఈ సినిమాని హ్యాండీల్ చేశాడు. ది లెజెండ‌రీ సంగీత ద‌ర్శ‌కులు కీర‌వాణి గారు 'బింబిసార‌'కు వెన్న‌ముక‌గా నిలిచారు. దీన్ని విజ‌య‌వంతం చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులంద‌రికి వంద‌నాలు' అని ట్వీట్ చేసి త‌న ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు ఎన్టీఆర్‌.

ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. క‌ల్యాణ్ రామ్ అత్యంత ప్ర‌తిష్టాత్మంగా భావించి భారీ స్థాయిలో నిర్మించిన ఈమూవీలో కేథ‌రిన్‌, సంయుక్త మీన‌న్, వారినా హుస్సేన్‌ హీరోయిన్ లుగా న‌టించారు. శ్రీ‌నివాసరెడ్డి, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, ప్ర‌కాష్ రాజ్‌, సాయి కిర‌ణ్‌, అయ్య‌ప్ప పి. శ‌ర్మ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.