Begin typing your search above and press return to search.
డిఫరెంట్ గెటప్స్ ట్రై చేస్తున్న ఎన్టీఆర్.. అందుకేనట!
By: Tupaki Desk | 27 Jun 2021 5:00 AM ISTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే 'ఎవరు మీలో కోటీశ్వరులు' రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నందమూరి అభిమానులు కూడా ఈ పాపులర్ షోలోకి ఎన్టీఆర్ ఎంటర్ అవ్వడంతో టీవీ ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు. ఆల్రెడీ ఎవరు మీలో కోటిశ్వరులు షోలో ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ గురించి కూడా సెలక్షన్ జరుగుతుంది. ఇప్పటివరకు ప్రోమోలో ద్వారా షో పై ఆసక్తిని పెంచేసారు. వరల్డ్ లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ అండ్ పాపులర్ రియాలిటీ షోలలో ఒకటి ఈ షో. దాదాపు 120 దేశాలకు పైగా ఈ రియాలిటీ షోను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి.
కానీ ఇండియాలో మొదటగా హిందీలో 'కౌన్ బనేగా కరోడ్ పతి'గా ప్రారంభమైంది. ఆ తర్వాత తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే పేరుతో నాలుగు సీజన్లు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఇప్పుడు ఐదవ సీజన్ హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ సిద్ధం అవుతున్నాడు. ఆ మధ్యలో ప్రోమోతో పాటు ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' సూట్ వేసుకున్న లుక్ పోస్ట్ చేసాడు. ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఆ సూట్ బ్లాక్ కలర్ లో స్టైలిష్ గా కనిపించింది. ఆ లుక్కులో ఎన్టీఆర్ ను చూసేసరికి ఎవరు మీలో కోటిశ్వరుడులో అదే గెటప్ అనుకున్నారు.
అయితే ఈ షోకు సంబంధించి ఎన్టీఆర్ లుక్ గెటప్ ఇంకా కన్ఫర్మ్ కాలేదని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ తో పలు రకాల కాస్ట్యూమ్స్ వేయిస్తూ ఫోటో సెషన్స్ జరుపుతున్నారని సమాచారం. ప్రస్తుతం లుక్ కన్ఫర్మ్ చేసుకుంటే తర్వాత ఎలాగైనా షూట్ ప్రారంభం చేసుకోవచ్చని ప్లాన్ లో ఉన్నారు జెమిని టీవీ యాజమాన్యం. అలాగే వచ్చే నెలలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా పూర్తి అవుతుంది. కాబట్టి ఆ వెంటనే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటిశ్వరులు ప్రోగ్రాం ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్టీఆర్ నటించబోయే తదుపరి సినిమా ప్రీ-ప్రొడక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తదుపరి సినిమా ఆగష్టులో స్టార్ట్ చేయనున్నట్లు టాక్. చూడాలి మరి ఈసారి ఎన్టీఆర్ స్టైల్ లో ఎవరు మీలో కోటిశ్వరులును సక్సెస్ చేస్తాడేమో!