Begin typing your search above and press return to search.

అగ్రదర్శకుడితో యంగ్ టైగర్.. 5వ మూవీ??

By:  Tupaki Desk   |   5 Jun 2021 2:00 PM IST
అగ్రదర్శకుడితో యంగ్ టైగర్.. 5వ మూవీ??
X
టాలీవుడ్ మాస్ ఇమేజ్ కలిగిన స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తయిన వెంటనే తదుపరి సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు. అందుకే ఆల్రెడీ తదుపరి సినిమాలు కన్ఫర్మ్ చేసి పెట్టాడు. నిజానికి ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. రాజమౌళితో సినిమా అంటే అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. అందులోనూ ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న 4వ సినిమా ఇది. ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పట్లో రావడం కష్టమే అనిపిస్తుంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ - స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ సినిమా చేయనున్నాడు. ఇటీవలే త్రివిక్రమ్ తో మూవీ కాన్సల్ కావడంతో వెంటనే కొరటాల శివ స్క్రిప్ట్ ఓకే చేసాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అంతేగాక ప్రస్తుతం కొరటాల సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా పాన్ ఇండియా ఫేమ్ కలిగిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ లైన్ లో పెట్టేసాడు. ఈ కాంబినేషన్ పై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా.. రాజమౌళి - ఎన్టీఆర్ కాంబినేషన్ లో 5వ మూవీ వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నట్లు టాక్. అందుకు సంబంధించి ఆల్రెడీ రాజమౌళితో చర్చలు కూడా జరుగుతున్నాయట. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ కొరటాల ప్రాజెక్ట్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యే సరికి 2022 ముగుస్తుంది. ఆ తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీతో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇదివరకు వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ స్టార్ షారుఖ్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ సినిమా కంప్లీట్ అయ్యాక అట్లీ కూడా ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 2023 వరకు సమయం పడుతుందట. అయితే 2024లో ఎన్టీఆర్ - రాజమౌళి కాంబో తెరమీదకు రాబోతుందని సమాచారం.