Begin typing your search above and press return to search.

RRR ముగించి కొర‌టాల‌తో జేగంట మోగించాడు!

By:  Tupaki Desk   |   27 Aug 2021 8:00 PM IST
RRR ముగించి కొర‌టాల‌తో జేగంట మోగించాడు!
X
ప్ర‌తిష్ఠాత్మ‌క ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ముగించిన‌ ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రానికి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. కొర‌టాల ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎన్టీఆర్ 30 గా ప్ర‌చారంలో ఉన్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు.. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఇప్ప‌టికే బాణీల‌ను రెడీ చేస్తున్నార‌ని తెలిసింది. ఈ సినిమా కోసం అతడికి భారీ పారితోషికాన్ని నిర్మాత‌లు చెల్లిస్తున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ అజ్ఞాత‌వాసి.. నాని- జెర్సీ.. గ్యాంగ్ లీడర్ చిత్రాల‌కు అనిరుధ్ సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ - కొర‌టాల బృందంతో అతని నాలుగో తెలుగు సినిమా ఇది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ -కొరటాల శివ రెండోసారి కలిసి ప‌ని చేస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో కథానాయికగా న‌టిస్తోంది. తార‌క్ తో అర‌వింద స‌మేత త‌ర్వాత రెండోసారి పూజా అవ‌కాశం ద‌క్కించుకుంది. ఇతర తారాగణం సిబ్బంది వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ 30 ని యువసుధ ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తుంది.

2022 వేసవిలో విడుదల చేయాల‌న్న‌ది ప్లాన్. తార‌క్ ఈ మూవీ కోసం కొత్త మేకోవ‌ర్ ని ట్రై చేస్తార‌న్న టాక్ వినిపిస్తోంది. అత‌డు పూర్తిగా స్లిమ్ లుక్ తో ఎంతో స్టైలిష్ అవ‌తారంలో క‌నిపిస్తార‌ట‌. తార‌క్ కోసం కొర‌టాల ఎంపిక చేసుకున్న లైన్ ఏమిట‌న్న‌దానిపైనా ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ప్ర‌తిసారీ సామాజిక అంశాల మేళ‌వింపుతో కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్రాల‌ను తెర‌కెక్కిస్తున్న కొర‌టాల మ‌రో అద్భుత‌మైన కాన్సెప్టును తార‌క్ కోసం రెడీ చేసార‌న్న టాక్ వినిపిస్తోంది.