Begin typing your search above and press return to search.
నందమూరి బ్రదర్స్.. ఆల్ ఓకె
By: Tupaki Desk | 11 Jun 2018 9:56 AM ISTనందమూరి హీరోలు... మరియు బ్రదర్స్.. కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. సినిమా ఫంక్షన్లకు అటెండవుతూనే ఉన్నారు. కానీ ఈమధ్య వారిద్దరూ ఒక వేదికపై కనిపించలేదు. ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేసిన జైలవకుశ సినిమా ఈవెంట్లో మాత్రమే వాళ్లు కలిసి కనిపించారు. ఆ తరవాత వాళ్లిద్దరూ ఒకే వేదికపైకి రాకపోవడంతో అన్నదమ్ముల మధ్య గొడవలు తలెత్తాయంటూ టాలీవుడ్ లో ప్రచారం మొదలైంది.
ఈ ప్రచారంపై ఇటు కళ్యాణ్ రామ్ కానీ.. అటు ఎన్టీఆర్ గానీ ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. కానీ వాటన్నింటికీ ఒకే ఒక్క ఈవెంట్ తో చెక్ చెప్పేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ నా నువ్వే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పేశాడు. నా నువ్వే సినిమాకు మొదట్లో మంచి బజ్ వచ్చింది. కానీ అనుకున్న టైంకు రిలీజ్ కాకపోవడంతో అది కాస్తా తగ్గిపోయింది. ఇఫ్పుడు ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం గ్యారంటీగా నా నువ్వే సినిమా ప్రమోషన్ కు ఉపయోగపడుతుంది. ఈ రకంగా తారక్ రాక అన్న సినిమాకు ప్రమోట్ చేయడానికి.. రెండు తమ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారానికి చెక్ చెప్పడానికి రెండు రకాలుగా ఉపయోగపడుతోంది. ఇద్దరి మధ్యనా ఆల్ ఓకె అని ఇప్పుడైనా అనుకోవాల్సిందే.
పటాస్ తరవాత కళ్యాణ్ రామ్ కు హిట్ అన్నదే లేకపోయింది. దీంతో ప్రస్తుతం అతడి ఆశలన్నీ నా నువ్వేపైనే ఉన్నాయి. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. జయేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.