Begin typing your search above and press return to search.

ఈసారి తారక్ టార్గెట్ పెద్దదే

By:  Tupaki Desk   |   24 Aug 2016 11:00 PM IST
ఈసారి తారక్ టార్గెట్ పెద్దదే
X
తెలుగులో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే మెగాస్టార్ చిరంజీవిని ఢీకొట్టిన ఘనత అతడిది. ఆది.. సింహాద్రి లాంటి సినిమాలు అతణ్ని ఎక్కడికో తీసుకెళ్లాయి. కానీ వయసుకు మించి హిట్లు చూసిన ఎన్టీఆర్.. ఆ తర్వాత చాలా స్ట్రగులయ్యాడు. తన ముందు చాలా చిన్నగా అనిపించిన హీరోలు ఇంతింతై అని ఎదిగిపోతుంటే.. అతను మాత్రం ఒక దశను దాటి ఎదగలేకపోయాడు. కొందరికి చాలా సాధారణంగా మారిపోయిన యాభై కోట్ల క్లబ్బును అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఎన్టీఆర్. 2014 చివరిదాకా ఎన్టీఆర్ అసలు రికార్డుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఓ మోస్తరు హిట్టు వస్తే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఐతే టెంపర్.. నాన్నకు ప్రేమతో సినిమాలు ఎన్టీఆర్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించాయి. స్టడీగా నిలబడ్డ ఎన్టీఆర్.. ఇప్పుడు రికార్డుల మీద కన్నేశాడు.

ఎన్టీఆర్ కెరీర్లో సరైన టైమింగ్ లో వస్తున్న ‘జనతా గ్యారేజ్’.. అంచనాలకు తగ్గట్లు ఉంటే మాత్రం ఎన్టీఆర్ నేరుగా తీసుకెళ్లి నెంబర్ వన్ రేసులో నిలబెట్టేస్తుందనడంలో సందేహం లేదు. టాలీవుడ్లో రికార్డుల మాటెత్తగానే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్.. మహేష్ బాబులే. ‘బాహుబలి’ని పక్కనబెట్టేస్తే డే-1 రికార్డులైనా.. వీకెండ్ రికార్డులైనా ప్రధానంగా వీళ్లిద్దరి పేరిటే ఉంటాయి. ఈ మధ్య అల్లు అర్జున్ వాళ్లకు కొద్దిగా పోటీ ఇస్తున్నాడు. ఐతే ‘జనతా గ్యారేజ్’ మీద ఉన్న అంచనాల ప్రకారమైతే.. ఎన్టీఆర్ కూడా రేసులోకి వచ్చినట్లే. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే తొలి రోజు వసూళ్లను కాకపోయినా.. తొలి వారాంతం వసూళ్లను దాటేందుకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఎందుకంటే లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీతో వస్తోంది ‘జనతా గ్యారేజ్’.